ఆ హీరో అంటే క్రష్.. ఆయనతో నటించడమే నా కల.. రాశీ ఖన్నా..
Rajitha Chanti
Pic credit - Instagram
29 May 2026
టాలీవుడ్‌లో 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాశీ ఖన్నా. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.
ఒక ఇంటర్వ్యూలో రాశీ ఖన్నా మాట్లాడుతూ... మహేష్ బాబు అంటే తనకు క్రష్ అని.. ఆయనతో సినిమాలో నటించడమే తన కల అని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.
మహేష్ బాబుతో ఒక మంచి ప్రాజెక్ట్‌లో భాగం కావాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. తనకు ఎలాంటి సినిమాలో నటించాలని ఉందో క్లారిటీ ఇచ్చింది.
హాలీవుడ్ క్లాసిక్ చిత్రం 'మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్' (Mr. & Mrs. Smith) తరహాలో యాక్షన్, కామెడీ మేళవించిన సబ్జెక్ట్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది.
ఒకవేళ అలాంటి కథలో మహేష్ బాబు సరసన నటించే అవకాశం వస్తే అది ఇంకా అద్భుతంగా ఉంటుందని రాశీ ఖన్నా ఆశాభావం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం రాశీ ఖన్నా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఢిల్లీకి చెందిన రాశీ ఖన్నా మోడలింగ్ రంగం నుండి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
చదువులో ఎప్పుడూ టాపర్‌గా ఉండే ఆమె ఐఏఎస్ (IAS) ఆఫీసర్ కావాలని అనుకుంది, కానీ విధి ఆమెను గ్లామర్ ప్రపంచం వైపు నడిపించింది.
బాలీవుడ్ సినిమా 'మద్రాస్ కేఫ్' (2013) లో ఒక చిన్న పాత్రతో కెరీర్ ప్రారంభించిన రాశీ ఖన్నా, ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఎదిగింది.