శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న రామ్మోహన్ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. అనారోగ్యంతో బాధపడుతూ, తల్లితో కలిసి అనంతపురం ఆసుపత్రికి వెళ్తుండగా మదనపల్లి-కదిరి మార్గంలో ఈ విషాదం చోటుచేసుకుంది. కళ్ల ముందే కొడుకు చనిపోవడంతో తల్లి రోదనలు అక్కడి వారిని తీవ్రంగా కలిచివేశాయి.