AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘ఆ స్టార్ హీరో బావ అని పిలిచేవాడు.. చుట్టూ ఉన్నవాళ్లే అతడ్ని మోసం చేశారు’

ప్రముఖ నిర్మాత, దర్శకుడు దాసరి నారాయణ రావు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను వెల్లడించారు. తనకు నాటి స్టార్ హీరోకి మధ్య ఉన్న అనుబంధాన్ని వివరించాడు. ఆ స్టార్ హీరో తనను బావ అని పిలిచేవాడని.. అలాగే.. ఆ తర్వాత.. ఈ స్టోరీ చూసేయండి.

Tollywood: 'ఆ స్టార్ హీరో బావ అని పిలిచేవాడు.. చుట్టూ ఉన్నవాళ్లే అతడ్ని మోసం చేశారు'
Dasari Narayana Rao'
Ravi Kiran
|

Updated on: Mar 18, 2026 | 12:59 PM

Share

శోభన్ బాబు మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దాసరి నారాయణరావు తెలిపారు. ఎంతో క్రమశిక్షణతో, ఒత్తిడి లేకుండా జీవించిన ఆయన 97 ఏళ్లు బతుకుతానని చెప్పేవారు. మరణం గురించి ఊహించని విధంగా ఆయన వెళ్లిపోవడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.

వివరాల్లోకి వెళ్తే.! నిర్మాత, దర్శకుడు దాసరి నారాయణరావు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్టార్ నటుడు శోభన్ బాబు మరణం తనను ఎంతగానో బాధించిందని, ఊహించని సంఘటనగా మిగిలిపోయిందని గుర్తు చేసుకున్నారు. దివంగత నటుడు శోభన్ బాబు జీవితంలో టెన్షన్ అనే పదాన్ని ఎప్పుడూ దరిచేరనీయని, ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. శోభన్ బాబు తరచుగా “నేను 97 ఏళ్ళు బతుకుతాను బావ” అని సరదాగా చెప్పేవారని, మిగిలిన మూడేళ్ళు దేనికోసం అంటే, “పైకి వెళ్ళడానికి ట్రావెలింగ్‌కి గ్రేస్ కావాలి కదా, అందుకే గ్రేస్ ఇస్తున్నాను” అని చెప్పేవారని వివరించారు. ఈ విధంగా తన జీవితకాలం గురించి ఎంతో గ్రేస్‌గా, హాస్యంగా చెప్పే శోభన్ బాబు అకస్మాత్తుగా మరణించడం తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని దాసరి నారాయణరావు ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కాగా, పలువురు నటులు.. శోభన్ బాబుకు చుట్టూ ఉన్నవాళ్లే ఆయన్ని మోసం చేశారని చెప్పిన సందర్భాలు లేకపోలేదు.

Follow Us
ఆ స్టార్ హీరో బావ అని పిలిచేవాడు.. చుట్టూ ఉన్నవాళ్లే..
ఆ స్టార్ హీరో బావ అని పిలిచేవాడు.. చుట్టూ ఉన్నవాళ్లే..
లైక్స్ కావలి అంటే ప్రాణాలు పోవాల్సిందేనా ??
లైక్స్ కావలి అంటే ప్రాణాలు పోవాల్సిందేనా ??
ఇది పెళ్లా లేక ఉట్టి కొట్టే పోటీలా? గాలిలో తేలుతూ వధూవరుల వరమాల
ఇది పెళ్లా లేక ఉట్టి కొట్టే పోటీలా? గాలిలో తేలుతూ వధూవరుల వరమాల
కళ్ల కింద నలుపు చిటికెలో మాయం.. ఇలా చేస్తే 2 రోజుల్లో
కళ్ల కింద నలుపు చిటికెలో మాయం.. ఇలా చేస్తే 2 రోజుల్లో
ఈ సూపర్ టెక్నిక్‌తో పిల్లల నుంచి ఈజీగా మొబైల్ దూరం చేయొచ్చు..
ఈ సూపర్ టెక్నిక్‌తో పిల్లల నుంచి ఈజీగా మొబైల్ దూరం చేయొచ్చు..
Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు-కర్కాటక రాశి
Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు-కర్కాటక రాశి
అత్యంత వేగంగా రైల్వే టికెట్ల బుకింగ్.. ఐఆర్‌సీటీసీ కొత్త సిస్టమ్
అత్యంత వేగంగా రైల్వే టికెట్ల బుకింగ్.. ఐఆర్‌సీటీసీ కొత్త సిస్టమ్
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మిథున రాశికి ఎలా ఉందంటే..?
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మిథున రాశికి ఎలా ఉందంటే..?
శ్రీకృష్ణుడికి కుచేలుడు ఇచ్చిన కానుక..మీ డైట్‌లో చేర్చుకున్నారంటే
శ్రీకృష్ణుడికి కుచేలుడు ఇచ్చిన కానుక..మీ డైట్‌లో చేర్చుకున్నారంటే
చిరంజీవి, ఆర్జీవీ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.. మణిశర్మ..
చిరంజీవి, ఆర్జీవీ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.. మణిశర్మ..