AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya: కరుప్పుతో మొదలైన జైత్రయాత్ర.. సూర్య ప్లానింగ్ వెనక ఉన్న అసలు మాస్టర్ స్ట్రోక్ ఇదేనా

Suriya: కరుప్పుతో మొదలైన జైత్రయాత్ర.. సూర్య ప్లానింగ్ వెనక ఉన్న అసలు మాస్టర్ స్ట్రోక్ ఇదేనా

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: May 29, 2026 | 5:17 PM

Share

కరుప్పు భారీ విజయంతో సూర్య కెరీర్ కొత్త ఊపందుకుంది. సీక్వెల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సూర్య, ప్రస్తుతం విశ్వనాథ్ అండ్ సన్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జీతు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య 47 షూటింగ్ కూడా వేగంగా సాగుతోంది. వరుస ప్రాజెక్టులతో 2026 సంవత్సరం సూర్యకు అత్యంత ప్రత్యేకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

కరుప్పు సినిమా సక్సెస్‌ని ముందే ఊహించాను. జస్ట్ గంట సేపు కథ వినగానే ఓకే చెప్పేశాను. అయితే కరుప్పును నెక్స్ట్ రేంజ్‌ హిట్‌గా నిలబెట్టింది మాత్రం ప్రేక్షకులే అంటూ సూర్య చెప్పిన మాటలు వైరల్‌ అవుతున్నాయి. ఆయన మాటలను కాదుగానీ, ఆయన ప్లానింగ్‌ని డీకోడ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆడియన్స్. కరుప్పు సినిమాకు సీక్వెల్‌ ఉంటుందా? లేదా? అనేది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. నేను కూడా ఈ ఆన్సర్‌ కోసం ఆసక్తిగా, ఆశగా ఎదురుచూస్తున్నానని ఇంకాస్త హైప్‌ తెచ్చేశారు సూర్య. ఆల్రెడీ 300 కోట్ల వైపు మార్చ్ చేస్తోంది కరుప్పు మూవీ. పర్ఫెక్ట్ టైమ్‌ లో పర్ఫెక్ట్ కథతో హిట్‌ వచ్చేసిందని హ్యాపీగా ఉన్నారు నడిప్పిన్‌ నాయగన్‌ ఫ్యాన్స్. కరుప్పు సక్సెస్‌ని విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ తో కంటిన్యూ చేసి తీరుతామనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది సూర్యలో. ఆల్రెడీ రిలీజ్‌ అయిన ప్రమోషనల్‌ కంటెంట్‌ అప్పటి నుంచీ వైరల్‌ అవుతూనే ఉంది. సూర్య ఇందులో షార్ప్ షూటర్‌గా కనిపిస్తారు. ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోంది. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ జులైలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. తనకున్న తెలుగు మార్కెట్‌ని ఈ మూవీతో మరింత ఎస్టాబ్లిష్‌ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు సూర్య. టాలీవుడ్‌లో ది బెస్ట్ మూవీ చేయాలన్న ఆయన డ్రీమ్‌ ఈ సినిమాతో నెరవేరుతుందని అంటోంది టీమ్‌. విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ రిలీజ్‌ కావడానికి ముందే సూర్య 47 షూటింగ్‌ కూడా పూర్తవుతుంది. నస్లేన్‌ ఈ విషయాన్ని చెప్పగానే ఎగిరిగంతేసినంత పని చేశారు సూర్య ఫ్యాన్స్. జీతు మాధవన్‌ దర్శకత్వంలో సూర్య చేస్తున్న ఈ సినిమాలో నజ్రియా హీరోయిన్‌గా నటిస్తున్నారు. సో, ఆల్రెడీ కోలీవుడ్‌లో హిట్‌ అందింది, తెలుగు సినిమా పాజిటివ్‌ టాక్‌తో రెడీ అవుతోంది. సూర్య 47 షూట్‌ కంప్లీట్‌ చేసుకుంటోంది… వీటన్నిటిని బట్టి 2026 నడిప్పిన్‌ నాయగన్‌కి చాలా బాగా కలిసొచ్చింది. ఇదే జోరు కంటిన్యూ అయితే, సూర్య… నెక్స్ట్ కోలీవుడ్‌ టాప్‌ స్టార్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయంటున్నారు క్రిటిక్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Aadhaar App: ఆధార్‌ పై కీలక నిర్ణయం.. పాత ‘ఎమ్‌ఆధార్’ యాప్ బంద్

TTD: శ్రీవారి భక్తులకు భారీ ఊరట ఇక.. క్యూలైన్‌లో ఉండే పని లేదు

షాక్‌లో సినీ డైరెక్టర్లు! 66 హార్డ్ డిస్క్‌లు మాయం

Peddi: పెద్ది దుబాయ్ సెన్సార్ టాక్ మామూలు కాదు.. చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటారా

అంతరిక్షంలో మనిషి పుట్టుకకు తొలి అడుగు.. చైనా సంచలన ప్రయోగం వెనక అసలు కథ

Follow Us