AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రాత్రి పడుకుని.. ఉదయం లేచి చూసేసరికి ఆ కాలనీలోని కార్లన్నీ ఇలానే

సంగారెడ్డి జిల్లా జోగిపేట హౌసింగ్ బోర్డు కాలనీలో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు రెచ్చిపోయారు. ఇండ్ల ముందు రోడ్డుపై పార్క్ చేసిన కార్లను టార్గెట్ చేస్తూ రాళ్లు, కర్రలతో విండ్‌షీల్డ్‌లు, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. అర్ధరాత్రి పెద్ద శబ్దాలు రావడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం లేచి చూసేసరికి..

Telangana: రాత్రి పడుకుని.. ఉదయం లేచి చూసేసరికి ఆ కాలనీలోని కార్లన్నీ ఇలానే
Car Vandalism
P Shivteja
| Edited By: |

Updated on: May 29, 2026 | 9:55 PM

Share

సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఆకతాయిలు రెచ్చిపోయారు. ఇండ్ల ముందు పార్క్ చేసి ఉంచిన కార్లను టార్గెట్ చేస్తూ వరుసగా అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆందోల్ మండలంలోని జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలనీవాసులు రాత్రి సమయంలో ఇండ్ల ముందు రోడ్డుపై పార్క్ చేసి ఉంచిన కార్లపై గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు.

అర్ధరాత్రి ఒక్కసారిగా పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అయితే అప్పటికే దుండగులు రాళ్లు, కర్రలతో కార్ల విండ్‌షీల్డ్‌లు, కిటికీ అద్దాలను ధ్వంసం చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయం లేచి చూసేసరికి పలువురు వాహన యజమానులు తమ కార్ల అద్దాలు పగిలిపోయి ఉండటాన్ని గమనించి షాక్‌కు గురయ్యారు. లక్షల రూపాయల విలువైన వాహనాలు ధ్వంసం కావడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్థానికుల ప్రకారం.. గత నెల రోజుల క్రితం కూడా ఇదే తరహా ఘటన జరిగినట్లు తెలిపారు. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కావడంతో కాలనీవాసులు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు జోగిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఆకతాయిల ముఠాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కాలనీల్లో రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్‌ను పెంచాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి.. 

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి