AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care: 20 ఏళ్లు దాటిన మహిళల్లో పెరుగుతున్న భయం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్‌ తీసుకోకండి.. డాక్టర్ల హెచ్చరిక!

Health Care: మహిళలకు 20 ఏళ్లు దాటినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 20 నుంచి 40 ఏళ్ల ఉన్న మహిళల్లో ఈ సమస్య తలెత్తుతోందని, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. మరి అదేంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Health Care: 20 ఏళ్లు దాటిన మహిళల్లో పెరుగుతున్న భయం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్‌ తీసుకోకండి.. డాక్టర్ల హెచ్చరిక!
Health Care
Subhash Goud
|

Updated on: Jul 26, 2026 | 8:38 PM

Share

Health Care: ఇటీవలి కాలంలో 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు మహిళల్లో రొమ్ము గడ్డల కేసులు పెరుగుతున్నాయని నిపుణులు తెలిపారు. ఈ గడ్డలలో చాలా వరకు క్యాన్సర్ కానివి అయినప్పటికీ, రొమ్ములో కొత్తగా ఏ గడ్డ తగిలినా నిర్లక్ష్యం చేయవద్దని, వెంటనే వైద్య సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

గతంలో రొమ్ము గడ్డలు ప్రధానంగా వయసు పైబడిన మహిళల్లో కనిపించేవి. అయితే, ఇప్పుడు 20, 30, 40 ఏళ్ల వయసున్న మహిళలు కూడా రొమ్ము సంబంధిత సమస్యలతో వైద్యుల వద్దకు వస్తున్నారు. మారుతున్న జీవనశైలి, ఊబకాయం, హార్మోన్ల అసమతుల్యత, ఆలస్యంగా గర్భం దాల్చడం, కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉండటం, మహిళల్లో పెరిగిన అవగాహన వంటివి ఈ పెరుగుదలకు గల కారణాలని నిపుణులు భావిస్తున్నారు.

పూణేలోని లుల్లానగర్‌లో ఉన్న మదర్‌హుడ్ హాస్పిటల్‌లో ప్రసూతి, గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ సుజాత ఉదయ్ రాజ్‌పుత్ దీనిపై పలు కీలక విషయాలు వెల్లడించారు. “ప్రతి వారం 25 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి 10 మంది మహిళల్లో సుమారు 3 మంది, స్వయంగా రొమ్మును పరీక్షించుకునేటప్పుడు లేదా రోజువారీ పనుల సమయంలో రొమ్ములో గడ్డను గమనించిన తర్వాత చికిత్స కోసం ఆసుపత్రికి వస్తుంటారని అన్నారు. ఈ గడ్డలలో చాలా వరకు ఫైబ్రోఅడెనోమాలు, సిస్ట్‌లు, హార్మోన్ల మార్పులు లేదా ఇన్ఫెక్షన్ల వల్ల ఏర్పడతాయని, వీటికి క్యాన్సర్‌తో సంబంధం ఉండదని అన్నారు. అయితే, రొమ్ములో నిరంతరం ఉండే గడ్డ, రొమ్ము పరిమాణం లేదా ఆకారంలో మార్పు, చనుమొనల నుండి స్రావం, చర్మం లోపలికి కుంచించుకుపోవడం, చనుమొనలు లోపలికి వెళ్లడం లేదా చంకలో వాపు వంటి లక్షణాలు మీకు కనిపిస్తే, వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవడం అవసరమన్నారు. సకాలంలో వైద్య పరీక్ష, అవసరమైన ఇమేజింగ్ పరీక్షలు గడ్డకు కారణాన్ని కనుగొనడంలో సహాయపడతాయని, అవసరమైతే సకాలంలో చికిత్సను ప్రారంభించవచ్చన్నారు.

చాలా మందికి ఉండే అపోహా ఇదే..

చాలా మంది యువతులు ఈ చిన్న వయసులో తమకు రొమ్ము క్యాన్సర్ రాదని భావిస్తారని, కానీ ఇది ఒక అపోహ. అందువల్ల వారు వైద్యుడి వద్దకు వెళ్లడాన్ని ఆలస్యం చేస్తారు. రొమ్ములో కొత్తగా గడ్డ తగిలినట్లు అనిపించినప్పుడు, అది కొన్ని వారాల పాటు అలాగే ఉన్నా నిర్లక్ష్యం చేయకూడదు. రొమ్ముల పట్ల అవగాహన కలిగి ఉండటం, క్రమం తప్పకుండా స్వయంగా రొమ్ములను పరీక్షించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం తప్పనిసరి అని అన్నారు. అలాగే అధిక ప్రమాదం ఉన్న మహిళలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం వంటివి రొమ్ము క్యాన్సర్‌ను దాని ప్రారంభ దశలోనే గుర్తించడంలో సహాయపడతాయన్నారు. సకాలంలో చికిత్స తీసుకోవడం మహిళల ఆరోగ్యాన్ని, జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుందన్నారు.

గడ్డను పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం:

రొమ్ము ఆరోగ్యంపై అవగాహనే అత్యంత ప్రభావవంతమైన ఆయుధమని డాక్టర్ రాజ్‌పుత్ అన్నారు. ప్రతి వారం 25 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి 10 మంది మహిళల్లో దాదాపు 2 మంది, గడ్డ దానంతట అదే తగ్గిపోతుందని లేదా అది తీవ్రమైనది కాదని నమ్మడం వల్ల వైద్యుడిని సంప్రదించడంలో ఆలస్యం చేస్తున్నారన్నారు. ప్రతి మహిళ క్రమం తప్పకుండా స్వయంగా రొమ్ములను పరీక్షించుకోవాలి, ఏవైనా అసాధారణ మార్పులు గమనిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవాలని, బరువును అదుపులో ఉంచుకోవాలని అన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, వారి కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ వైద్య చరిత్ర ఉంటే తన వైద్యుడికి తెలియజేయాలంటున్నారు. ప్రతీ గడ్డ క్యాన్సర్ గడ్డ కాదు, కానీ ప్రతి గడ్డను పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. సకాలంలో వ్యాధిని గుర్తిస్తే, తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చు. అనవసరమైన భయాన్ని తగ్గించవచ్చు. అలాగే అవసరమైన చికిత్సను వెంటనే ప్రారంభించవచ్చని సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
20 ఏళ్లు దాటిన మహిళల్లో పెరుగుతున్న భయం.. ఈ లక్షణాలు కనిపిస్తే..
20 ఏళ్లు దాటిన మహిళల్లో పెరుగుతున్న భయం.. ఈ లక్షణాలు కనిపిస్తే..
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ
ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ