Andhra Pradesh: వద్దని వేడుకున్న వినలేదు.. ఉపాధ్యాయుడిని చావబాదిన ఇద్దరు యువకులు!
పల్నాడు జిల్లా పెదకూరపాడులో పాఠశాల ఉపాధ్యాయుడిపై ఇద్దరు యువకులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఎదురెదురుగా వాహనాలు ఢీకొన్న విషయంలో మొదలైన వివాదం చివరకు దాడికి దారితీసింది. ఉపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం.. వాహనాలు ఢీకొన్న ఘటనపై ఉపాధ్యాయుడు నరేష్ బాబుకు, యువకులకు మధ్య వివాదం మొదలైంది.
పల్నాడు జిల్లా పెదకూరపాడులో పాఠశాల ఉపాధ్యాయుడిపై ఇద్దరు యువకులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఎదురెదురుగా వాహనాలు ఢీకొన్న విషయంలో మొదలైన వివాదం చివరకు దాడికి దారితీసింది. ఉపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం.. వాహనాలు ఢీకొన్న ఘటనపై ఉపాధ్యాయుడు నరేష్ బాబుకు, యువకులకు మధ్య వివాదం మొదలైంది. అనంతరం యువకులు నరేష్ బాబును వెంబడించి పట్టుకున్నారు. ఆయన పనిచేస్తున్న పాఠశాల సమీపంలో కారును అడ్డగించి దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి తోటి ఉపాధ్యాయులు వీడియో రికార్డ్ చేశారు. ఈ ఘటనపై బాధిత ఉపాధ్యాయుడు పెదకూరపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

