AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

9నెలల గర్భిణీల ఆస్పత్రికి వచ్చిన మహిళ.. ఆపరేషన్‌ చేసిన వైద్యులు షాక్..! 4 కిలోల బరుతో..

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలోని ప్రముఖ వైద్య సంస్థ మోరి సుబ్బమ్మ మిషన్ ఆసుపత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి వార్తల్లో నిలిచారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 35 సంవత్సరాల మహిళ తీవ్ర పొత్తికడుపు నొప్పితో ఆసుపత్రికి రాగా, ఆమెను పరీక్షించిన వైద్యులు ఆశ్చర్యపోయారు.

9నెలల గర్భిణీల ఆస్పత్రికి వచ్చిన మహిళ.. ఆపరేషన్‌ చేసిన వైద్యులు షాక్..! 4 కిలోల బరుతో..
4 Kg Uterine Tumor
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Oct 07, 2026 | 5:34 PM

Share

అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి సుబ్బమ్మ మిషన్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 35 ఏళ్ల మహిళ గర్భాశయంలో భారీ కణితితో సరిగ్గా 9 నెలల గర్భిణీలా ఆసుపత్రికి వచ్చారు. కణితి సైజు పెద్దదిగా ఉండటంతో కిడ్నీలు, మూత్రనాళాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని గుర్తించిన వైద్యులు అప్రమత్తమయ్యారు. ​ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ లతాపాల్ పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య బృందం రంగంలోకి దిగింది.

ముందుగా ఒంగోలుకు చెందిన యూరాలజిస్ట్ డాక్టర్ నోయల్ జాన్  రోగి మూత్రనాళాలకు స్టెంట్లు అమర్చారు. అనంతరం రాయవెల్లూరుకు చెందిన డాక్టర్ పాల్ ఇమ్మాన్యుయేల్ అత్యంత చాకచక్యంగా శస్త్రచికిత్స చేసి , గర్భసంచి నుంచి 4 కిలోల బరువున్న భారీ కణితిని విజయవంతంగా తొలగించారు.

వీడియో ఇక్కడ చూడండి..

​ఆపరేషన్ తర్వాత రోగికి నొప్పి తెలియకుండా డాక్టర్ సృజన ఆధ్వర్యంలో ఎపిడ్యూరల్ క్యాథటర్ అమర్చి, రెండు యూనిట్ల రక్తం ఎక్కించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందాన్ని ఆసుపత్రి చైర్మన్ నల్లి డార్విన్ ప్రత్యేకంగా అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us