AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెల్ల జుట్టుతో విసిగిపోయారా? కరివేపాకుతో ఇంట్లోనే హెయిర్ డై తయారు చేసుకోండిలా!

మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, పోషకాహార లోపం, కాలుష్యం కారణంగా నేటికాలంలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య జుట్టు చిన్న వయసులోనే తెల్లబడటం. ఈ తెల్లజుట్టును దాచడానికి మార్కెట్లో దొరికే రసాయన రంగులు వాడటం వల్ల తాత్కాలికంగా నలుపు వచ్చినా, లాంగ్ రన్‌లో జుట్టు రాలడం, కుదుళ్లు దెబ్బతినడం వంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయి. అందుకే మన ఇంట్లోనే దొరికే కరివేపాకు, ఉసిరి వంటి సహజ పదార్థాలతో ఎటువంటి కెమికల్స్ లేని హోమ్‌మేడ్ హెయిర్ డైను సులువుగా తయారుచేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

తెల్ల జుట్టుతో విసిగిపోయారా? కరివేపాకుతో ఇంట్లోనే హెయిర్ డై తయారు చేసుకోండిలా!
Homemade Hair Dye
Jyothi Gadda
|

Updated on: Oct 06, 2026 | 9:09 PM

Share

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం అనేది నేటికాలంలో తీవ్ర సమస్యగా మారింది. దీనికోసం రసాయన హెయిర్ డైలు ఉపయోగించడం వల్ల జుట్టు మరింత పొడిగా మారడంతో పాటు కుదుళ్లు బలహీనపడతాయి. అయితే, ఇంట్లోనే లభించే సహజ సిద్ధమైన పదార్థాలతో నకిలీ రసాయనాలు లేని హెయిర్ డై తయారు చేసుకోవచ్చు. ఈ హెయిర్ డై తయారీకి కావాల్సిన పదార్థాలు, ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

టీపొడి – 2 చెంచాలు

బిర్యానీ ఆకులు – 2

ఇవి కూడా చదవండి

కరివేపాకు – గుప్పెడు

కలొంజి (నల్ల జీలకర్ర) – 1 చెంచా

లవంగాలు – 5 నుండి 6

పసుపు – 1 చెంచా

ఉసిరి పొడి – 1 చెంచా

తయారీ విధానం:

మొదటగా ఒక ఇనుప బాణలి తీసుకుని అందులో టీపొడి, బిర్యానీ ఆకులు, కరివేపాకు వేసి సన్నని మంటపై వేయించాలి. ఆకులు లైట్‌గా పొగవస్తున్న సమయంలో కలొంజి విత్తనాలు, లవంగాలు, పసుపు కలపాలి. చివరిగా ఉసిరి పొడిని చేర్చి, ఆ మిశ్రమం పూర్తిగా నల్లటి రంగులోకి మారేంత వరకు బాగా వేయించి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసుకుని జల్లెడ పట్టుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరుచుకోవచ్చు.

ఎలా ఉపయోగించాలి?:

ఒక ఇనుప పాత్రలో కొద్దిగా పెరుగు లేదా నీరు తీసుకుని, అందులో తయారుచేసి పెట్టుకున్న పౌడర్‌ను కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను తెల్ల జుట్టు ఉన్న ప్రదేశాల్లో బాగా పట్టించి 2 గంటల పాటు ఉంచి, ఆపై సాధారణ నీటితో తలస్నానం చేయాలి. అత్యవసరంగా బయటకు వెళ్లాలనుకున్నప్పుడు ఈ పౌడర్‌లో కొద్దిగా కొబ్బరి నూనె లేదా అలోవెరా జెల్ కలిపి జుట్టుకు రాసుకుని 15-20 నిమిషాల తర్వాత కడిగేయవచ్చు.

క్రమం తప్పకుండా ఈ సహజసిద్ధమైన డైని ఉపయోగించడం వల్ల జుట్టుకు కుదుళ్ల నుంచి పోషణ లభించడమే కాకుండా, నలుపు రంగు సహజంగా తిరిగి వస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us