వీరికి బెల్లం విషయంతో సమానం.. తింటే అన్నీ సమస్యలే

Samatha

23 August 2026

బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది దీనిని తింటుంటారు. కానీ ఇది అందరికీ మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్ నిపుణులు.

చాలా మంది బెల్లం ఆరోగ్యానికి మేలు చేస్తుందని , ఎక్కువగా తింటుంటారు. కానీ  ఇది అందరికీ మంచిది కాదు, కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని అస్సలే తినకూడదంట.

కాగా, ఇప్పుడు మనం ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు బెల్లం తినకూడదు, తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో చూద్దాం.

షుగర్ ఉన్నవారు కొంత మంది పంచదార కాదు అని బెల్లం తింటుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదు, బెల్లంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ, ఇది షుగర్ లెవల్స్ పెరిగేలా చేస్తుంది.

అంతే కాకుండా ఆస్తమా ఉన్నవారు కూడా బెల్లం తినకపోవడమే మంచిది. ఇది కఫాన్ని పెంచుతుంది. దీని వలన శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఏర్పడవచ్చును.

అంతే కాకుండా ఎవరు అయితే బరువు తగ్గాలి అనుకుంటున్నారో వారు కూడా బెల్లం తీసుకోవడం అస్సలే మంచిది కాదు, ఇందులో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. త్వరగా బరువు పెరిగేలా చేస్తుంది.

కాలేయ ఆరోగ్యానికి కూడా ఇది అస్సలే మంచిది కాదు, కాలేయ సమస్యలతో బాధపడే వారు ఫ్యాటీ లివర్ సమస్యలు ఉన్నవారు అస్సలే బెల్లం తినకూడదు.

అంతే కాకుండా చిన్న పిల్లల్లో నులిపురుగుల సమస్య ఉంటుంది. అందువలన అలాంటి సమస్య ఉన్నవారికి కూడా బెల్లం ఇవ్వకూడదంట.