AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మెట్రో పార్కింగ్‌లో కలకలం.. కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!

Hyderabad: మెట్రో పార్కింగ్‌లో కలకలం.. కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!

Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Aug 27, 2026 | 7:47 AM

Share

హైదరాబాద్‌లోని మలక్‌పేట మెట్రో స్టేషన్ పార్కింగ్‌లో నిలిపి ఉంచిన ఓ బైక్‌కు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చాదర్‌ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఆకతాయిలు కావాలనే బైక్‌కు నిప్పంటించినట్లు అనుమానిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

హైదరాబాద్ పాతబస్తీలోని మాలక్‌పేట మెట్రో స్టేషన్ పార్కింగ్‌లో నిలిపి ఉంచిన ఓ ద్విచక్రవాహనానికి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న చాదర్‌ఘాట్ సీఐ మురారి ఫైర్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ప్రాథమిక దర్యాప్తు, స్థానికుల సమాచారం ఆధారంగా ఓ ఆకతాయి కావాలనే ద్విచక్రవాహనానికి నిప్పంటించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మాలక్‌పేట మెట్రో స్టేషన్ పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితుడిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

ఆకతాయి కావాలనే నిప్పంటించాడా?

బైక్‌కు మంటలు ఎలా అంటుకున్నాయనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు అందించిన సమాచారం, ప్రాథమిక దర్యాప్తులో లభించిన ఆధారాల ప్రకారం.. ఓ ఆకతాయి కావాలనే ద్విచక్రవాహనానికి నిప్పంటించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మంటలు ప్రమాదవశాత్తు అంటుకున్నాయా? లేక ఎవరైనా కావాలనే నిప్పంటించారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మాలక్‌పేట మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని చాదర్‌ఘాట్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనకు ముందు, తర్వాత అక్కడికి వచ్చిన వ్యక్తుల కదలికలను పోలీసులు పరిశీలిస్తున్నట్ల అధికారులు చెప్పుతున్నారు. బైక్‌కు నిప్పంటించిన వ్యక్తి ఎవరనే విషయాన్ని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

కేసు నమోదు.. దర్యాప్తు ముమ్మరం

ఈ ఘటనపై చాదర్‌ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బైక్ యజమాని నుంచి వివరాలు సేకరించడంతో పాటు ఘటన జరిగిన సమయంలో పార్కింగ్ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల గురించి కూడా ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన పూర్తయిన తర్వాత బైక్‌కు నిప్పంటించిన వ్యక్తిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కావాలనే నిప్పంటించినట్లు నిర్ధారణ అయితే నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Aug 27, 2026 07:28 AM
Follow Us