బెంగళూరు నుండి విజయవాడకు ప్రయాణిస్తున్న రాధ అనే మహిళకు సంబంధించిన 250-300 గ్రాముల బంగారు ఆభరణాలు బస్సులో మాయమయ్యాయి. ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు మండలం కోవూరు వద్ద ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. టికెట్ లేకుండా బస్సెక్కిన ఓ వ్యక్తిపై అనుమానం వ్యక్తమవుతోంది. బస్సులో సీసీ కెమెరాలు లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యంపై రాధ పోలీసులకు ఫిర్యాదు చేసింది.