AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? అయితే రూ.లక్షల్లో సంపాదించవచ్చు.. ఈ నోట్ ఉంటే లక్కీనే..

రూ.5 ట్రాక్టర్ ఫొటో కరెన్సీ నోటు మీ దగ్గర ఉందా.. పాత కాలంలో ఈ కరెన్సీ నోట్లు జారీ చేసేవారు. కానీ ఇప్పుడు ఎక్కడా ఇది లభించడం లేదు. అయితే ఇలాంటి నోటు మీ దగ్గర ఉండే రూ.లక్షల్లో మీరు పొందవచ్చు. అవును.. పాత కాలపు అరుదైన నోట్లకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది.

రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? అయితే రూ.లక్షల్లో సంపాదించవచ్చు.. ఈ నోట్ ఉంటే లక్కీనే..
5 Rupees Note
Venkatrao Lella
|

Updated on: Aug 28, 2026 | 9:59 PM

Share

రూ.5 ట్రాక్టర్ నోటు మీ దగ్గర ఉంటే రూ.లక్షలు మీ సొంతం. అవును.. మీరు విన్నది నిజమే. కొన్ని అరుదైన పాత, కొత్త నోట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని ఆన్‌లైన్లో పెట్టి రూ.లక్షకు అమ్మవచ్చు. ఇటీవల ఈ నోట్లకు సంబంధించిన ఆన్‌లైన్ మార్కెట్ పూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది. అరుదైన పాత నోట్లను ఆన్‌లైన్‌లో విక్రయించి బోల్డెంత డబ్బులు సంపాదిస్తున్నారు కొంతమంది. చాలామందికి పాతకాలపు కాయిన్లు, కరెన్సీ నోట్లను సేకరించే హాబీ ఉంటుంది. ఇలాంటివారు పాతకాలపు అరుదైన నోట్లను ఎంత ఖర్చు పెట్టినా సరే తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మార్కెట్లో డిమాండ్ ఉండటంతో.. రూ.లక్షలకు విక్రయిస్తున్నారు. కొంతమంది వీటిని తమ వద్ద ఉంచుకునేందుకు రూ.లక్షలు ఖర్చు చేసి మరీ తీసుకుంటున్నారు.

ట్రాక్టర్ ఫొటోకు ఇంత ఆదరణ ఎందుకు..?

ఇటీవల ట్రాక్టర్ ఫొటో కూడిన రూ.5 కరెన్సీ నోటుకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. వీటిని సొంతం చేసుకునేందుకు కాయిన్స్, నోట్లు సేకరించేవారు రూ.లక్షలు ఇవ్వడానికి కూడా వెనుకాడటం లేదు. రెట్టింపు ధరకు ఇవ్వడానికి వీళ్లు వెనుకడుగు వేయడం లేదు. ఇలాంటి నోట్లు కలిగి ఉన్నవారు వీటిని ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్‌లో పెట్టి విక్రయిస్తున్నారు. ఇక ట్రాక్టర్ ఫొటోతో పాటు 123 లేదా 786 సీరియల్ నంబర్ ఉన్న కరెన్సీ నోట్లను కూడా ఎక్కువ ధరకు తీసుకుంటున్నారు. కొన్ని మతాల్లో ఈ అంకెల నోట్లకు విశేషమైన ఆదరణ ఉందని, అందుకే ఎక్కువ ధర పలుకుతున్నట్లు చెబుతున్నారు.

పాత నోట్లను ఎక్కడ అమ్ముతారు..?

ప్రస్తుతం ఆన్‌లైన్లోనే అనేక వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వెబ్‌సైట్లలో కరెన్సీ నోట్లను అప్ లోడ్ చేస్తున్నారు. వాటి ఫొటోలతో పాటు సీరియల్ నెంబర్లు కనిపించేలా పోస్టులు పెడుతున్నారు. ఎంత ధరకు అమ్ముతామనే వివరాలు కూడా పెడుతున్నారు. దీంతో కొనుగోలుచేసేవారు ఈ ఫ్లాట్‌ఫామ్్ ద్వారా తీసుకుంటున్నారు. అయితే ఇలంటివి కొనుగోలు చేసేముందు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు నకిలీ నోట్లను పోస్ట్ చేసి విక్రయించవచ్చు. దీంతో ఫొటోలు స్పష్టంగా ఉన్నాయో.. లేదా చూసుకోవాలి. అలాగే కొన్నిచోట్ల అరుదైన పాత నోట్లకు వేలం పాట నిర్వహిస్తూ ఉంటారు. మీరు అక్కడికి వెళ్లి అయినా కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు సైబర్ నేరగాళ్లు నకిలీ నోట్లతో మోసాలకు గురి చేసే అవకాశముంటుంది. విక్రయదారుడికి సంబంధించిన వివరాలు అన్నీ తెలుసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి. లేకపోతే మోసపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Follow Us
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ
నేపాల్ శిథిల చిత్రం.. ప్రపంచాన్ని కదిలించిన విచలిత దృశ్యం..
నేపాల్ శిథిల చిత్రం.. ప్రపంచాన్ని కదిలించిన విచలిత దృశ్యం..
షాపుల్లో నకిలీ QR కోడ్‌ స్టిక్కర్లతో ఘరానా మోసం.. వీడియో చూడండి
షాపుల్లో నకిలీ QR కోడ్‌ స్టిక్కర్లతో ఘరానా మోసం.. వీడియో చూడండి
రయ్ అంటూ దూసుకెళ్తున్న కారు.. పోలీసులు ఆపగా బయటపడ్డ ట్విస్ట్
రయ్ అంటూ దూసుకెళ్తున్న కారు.. పోలీసులు ఆపగా బయటపడ్డ ట్విస్ట్
మల్లి ఇది నువ్వేనా? RRR ఛైల్డ్ ఆర్టిస్ట్ ఎలా మారిపోయిందో చూశారా?
మల్లి ఇది నువ్వేనా? RRR ఛైల్డ్ ఆర్టిస్ట్ ఎలా మారిపోయిందో చూశారా?
నాకు సినిమాలు వద్దు.. మా ఊరు వెళ్లిపోతానని ఆ హీరోయిన్ ఏడ్చింది..
నాకు సినిమాలు వద్దు.. మా ఊరు వెళ్లిపోతానని ఆ హీరోయిన్ ఏడ్చింది..
భార్య కోసం తాత నిరంతర పోరాటం.. ఇంతలో ట్విస్ట్
భార్య కోసం తాత నిరంతర పోరాటం.. ఇంతలో ట్విస్ట్