బక్కగా ఉన్న వారిని బలంగా చేసే సూప్.. పిల్లలకు ఇదే బెస్ట్

Samatha

23 August 2026

వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో సతమతం అవుతారు.

దగ్గు, జలుబు, వైరల్ పీవర్స్‌తో చాలా ఇబ్బంది పడుతారు. అయితే అలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన సమాచారం.

చాలా మంది పిల్లలకు ఎక్కువగా ఏం తినిపించాలో అర్థం కాక బయట ఫుడ్ పెడుతుంటారు. కానీ బయటిది కాకుండా ప్రతి రోజూ ఈ సూప్ తాగిస్తే ఆరోగ్యానికి చాలా మంచిదంట.

క్యారెట్ టమాటా సూప్. ఇది పిల్లల ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. పండిన టమాటాలు, తాజా క్యారెట్లతో  వీటిని తయారు చేస్తారు.

దీని కోసం ముందుగా టమాటాలు, క్యారెట్‌లు శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేయాలి తర్వాత అందులో ఉప్పు వేసి, నీరు పోసి బాగా మెత్తగా జ్యూసీగా అయ్యే వరకు ఉడికించుకోవాలి.

తర్వాత దీనిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి చాలా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. స్పూన్‌తో తినే విధంగా ఇది ఉండాలి.

తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి అందులో సూప్ వేసి, తగినన్ని నీరు పోసి, అలాగే చక్కెర, మిరియాల పొడి వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే సూప్ రెడీ.

ప్రతి రోజూ ఈ సూప్ పిల్లలకు తాగించడం వలన దగ్గు, జలుబు, వంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.