భారీ క్రేన్ పై నుంచి మీరాలం చెరువు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లోని మీరాలం చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. భారీ క్రేన్ పైనుంచి చెరువు చుట్టూ కొనసాగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు.. చెరువు పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మీరాలం చెరువు అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న పలు మౌలిక వసతుల పనులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
హైదరాబాద్‌లోని మీరాలం చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. భారీ క్రేన్ పైనుంచి చెరువు చుట్టూ కొనసాగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు.. చెరువు పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మీరాలం చెరువు అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న పలు మౌలిక వసతుల పనులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చెరువు పైన సస్పెన్షన్ బ్రిడ్జిని నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. చెరువు పరిసరాలను పర్యాటకులను ఆకర్షించేలా, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పనులను నిర్ణీత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సీఎం సూచించినట్లు సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఎవరెస్ట్ కరిగిపోతోంది.. కారణం ఇదే!
డీజే సౌండే నా బిడ్డను బలి తీసుకుంది
కంటెంట్ ఉన్నోడికి.. కటౌట్తో పనిలేదు డ్యూడ్!
అంత్యక్రియలు చేసిన తర్వాత 15 రోజులకు తిరిగొచ్చిన కొడుకు
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!

