సూర్యవంశీకి షాకిచ్చిన బీసీసీఐ..టీమ్ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆస్ట్రేలియా U19 సిరీస్ నుండి అనూహ్యంగా గల్లంతు కావడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే, ఆసియా క్రీడలలో భారత పురుషుల క్రికెట్ జట్టుకు వైభవ్ ఎంపిక కావడమే ఇందుకు కారణమని తేలింది. కేవలం 15 ఏళ్ల వయసులో అద్భుత ప్రదర్శనలతో వైభవ్ కెరీర్ వేగంగా దూసుకుపోతోంది, సీనియర్ క్రికెట్‌కు చేరువవుతోంది.
భారత క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరగనున్న సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశమైంది. కేవలం 15 ఏళ్ల వయసు కలిగిన వైభవ్‌ను సెలెక్టర్లు ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే, దీనికి స్పష్టమైన కారణం వెల్లడైంది. సెప్టెంబరు 18 నుండి అక్టోబరు 5 వరకు ఆస్ట్రేలియా U19 జట్టు భారత్‌లో సిరీస్ ఆడనుండగా, అదే సమయంలో సెప్టెంబరు 28 నుండి అక్టోబరు 3 వరకు జపాన్‌లోని ఐచి నాగోయాలో ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఈ ఆసియా క్రీడల కోసం భారత పురుషుల క్రికెట్ జట్టులో వైభవ్‌కు చోటు దక్కింది. రెండు టోర్నమెంట్ల తేదీలు ఒకేసారి రావడంతో, వైభవ్ U19 సిరీస్‌లో ఆడే అవకాశం లేదు. అందుకే సెలెక్టర్లు అతడిని ఈ జట్టులోకి తీసుకోలేదని స్పష్టమైంది.
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు

