నేపాల్లో సంభవించిన భయంకరమైన వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. వందలాది మంది మృతి చెందగా, వేలాది మంది గల్లంతయ్యారు. ఈ కష్టకాలంలో మానవత్వం సిగ్గుపడేలా ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. వరద నీటిలో కొట్టుకువచ్చిన మహిళ మృతదేహం చెవికున్న బంగారు కమ్మలను కొందరు లాక్కున్నారు. ఈ వీడియో చూసిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.