మార్కాపురం జిల్లాలో అధిక వడ్డీ ఆశతో మోసపోయిన 32 ఏళ్ల ఆదిలక్ష్మి దారుణ హత్యకు గురైంది. లక్ష రూపాయలు రెట్టింపు చేస్తానని నమ్మబలికి, ఆమె నుంచి 50 లక్షలు లాక్కున్న ఓ మహిళ పానీయంలో మత్తుమందు కలిపి చంపేసింది. మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి పొలంలో పాతిపెట్టింది. రెండు నెలల తర్వాత నిందితురాలు పట్టుబడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.