రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో గుండెలు పగిలే ప్రమాదం జరిగింది. హాస్పిటల్కు వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన కారులో మంటలు చెలరేగి, నలుగురు సజీవ దహనమయ్యారు. మాజీ సర్పంచ్ రామ్ సింగ్ చౌదరి, ఆయన భార్య సుజ్ఞా దేవి, మేనకోడలు మహిమ ప్రాణాలు కోల్పోయారు. కారు డోర్లు లాక్ అవ్వడంతో బయటకు రాలేకపోయారు.