AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నయన్ vs రష్మిక.. నార్త్ బాక్సాఫీస్‌పై సౌత్ బ్యూటీల భారీ పోరు!

నయన్ vs రష్మిక.. నార్త్ బాక్సాఫీస్‌పై సౌత్ బ్యూటీల భారీ పోరు!

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: May 29, 2026 | 5:23 PM

Share

సౌత్ నుంచి బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న హీరోయిన్లలో నయనతార, రష్మిక మందన్న ముందంజలో ఉన్నారు. ‘జవాన్’తో వెయ్యి కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన నయన్, ‘యానిమల్’, ‘పుష్ప’ చిత్రాలతో ఉత్తరాదిలో భారీ క్రేజ్ సంపాదించిన రష్మిక ఇప్పుడు మరో మెగా హిట్ కోసం సిద్ధమవుతున్నారు. తదుపరి వెయ్యి కోట్ల సినిమాను ముందుగా అందుకునేది ఎవరు అనే ఆసక్తికర చర్చ సాగుతోంది.

కొడ్తే ష్యూర్‌ షాట్‌ హిట్‌ కావాల్సిందే అన్నది నయన్‌ ఫార్ములా. పడ్డామని కూర్చుంటే ఎలా ప్రయత్నిస్తే పట్టు దొరుకుతుంది. పట్టుదలతో సాధించుకోవాలన్నది రష్మిక ఫార్ములా. ఒన్‌ ఇండియా ఒన్‌ సినిమా అవుతున్న ఈ టైమ్‌లోనూ, ఈ ఇద్దరు భామలు మన తరఫున నార్త్ సర్కిల్స్ ని ఏలేస్తున్నారు. ఇంతకీ వీరిద్దరి మధ్య పోటీ ఎలా ఉంది? బాలీవుడ్‌కి నయన్‌ ఎందుకు వెళ్లట్లేదనే ప్రశ్నను కొన్నేళ్ల పాటు ఫేస్‌ చేశారు లేడీ సూపర్‌స్టార్‌. ఆలస్యమెందుకు వచ్చేస్తున్నా.. ఇదీ నా స్టామినా అంటూ జవాన్‌తో ఎంట్రీ ఇచ్చి వెయ్యి కోట్లు కొట్టి చూపించేశారు. ఇప్పుడు సల్మాన్‌తో సినిమా చేస్తున్నారు అదే బాలీవుడ్‌లో. ఈ సారి జస్ట్ పెర్ఫార్మెన్స్ తో సరిపెట్టుకోవడం లేదు, అంతకు మించిన యాక్షన్‌ సీక్వెన్స్ చేయడానికి వంశీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారట మన లేడీ సూపర్‌స్టార్‌. సో, ఆల్రెడీ తాను క్రియేట్‌ చేసిన వెయ్యికోట్ల మార్కును మరోసారి రిపీట్‌ చేసేయాలన్న తపన కనిపిస్తోంది సీనియర్‌ బ్యూటీలో. నార్త్ లో నయన్‌తో పాటు వైరల్‌ అవుతున్న మరో సౌత్‌ బ్యూటీ రష్మిక మందన్న. యానిమల్‌తో నార్త్ ని రూల్‌ చేయడం మొదలుపెట్టారు నేషనల్‌ క్రష్‌. ఆ తర్వాత రిలీజ్‌ అయిన ఛావా కూడా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. శ్రీవల్లిగా రష్మిక నటనకు ఉత్తరాది వారు ఫిదా అయిపోయారు. సో, పుష్ప2తో డబుల్‌ వెయ్యి కోట్లకు చేరువైన ఈ నటి, మళ్లీ బాలీవుడ్‌లో ఆ మార్కును ఎప్పుడు టచ్‌ చేస్తారా? ఏ సినిమాతో వీలవుతుందా? అనే చర్చలు కూడా సాగుతున్నాయి. సో, ఇప్పుడు నయన్‌ అండ్‌ రష్మిక.. వీరిద్దరిలో నెక్స్ట్ థౌజండ్‌ క్రోర్స్ ని ఫస్ట్ కొల్లగొట్టేది ఎవరు? వీరిద్దరిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ముంబై వీధుల్లో మేజిక్‌ చేసే సౌత్‌ బ్యూటీలెవరు? అనే చర్చ జోరుగానే సాగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Aadhaar App: ఆధార్‌ పై కీలక నిర్ణయం.. పాత ‘ఎమ్‌ఆధార్’ యాప్ బంద్

TTD: శ్రీవారి భక్తులకు భారీ ఊరట ఇక.. క్యూలైన్‌లో ఉండే పని లేదు

షాక్‌లో సినీ డైరెక్టర్లు! 66 హార్డ్ డిస్క్‌లు మాయం

Peddi: పెద్ది దుబాయ్ సెన్సార్ టాక్ మామూలు కాదు.. చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటారా

అంతరిక్షంలో మనిషి పుట్టుకకు తొలి అడుగు.. చైనా సంచలన ప్రయోగం వెనక అసలు కథ

Follow Us