AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie : అప్పుడు చిరు రాజ్ కుమార్.. ఇప్పుడు చరణ్ శివన్న.. ఆ సీన్ రీక్రియేట్ చేసిన పెద్ది టీమ్..

ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. జూన్ 4న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. తాజాగా నెట్టింట ఓ ఫోటో అందరిని ఆకట్టుకుంటుంది.

Peddi Movie : అప్పుడు చిరు రాజ్ కుమార్.. ఇప్పుడు చరణ్ శివన్న.. ఆ సీన్ రీక్రియేట్ చేసిన పెద్ది టీమ్..
Chiranjeevi, Raj Kumar, Ram
Rajitha Chanti
|

Updated on: May 29, 2026 | 9:27 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. పక్కా మాస్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో జగపతి బాబు, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకు విడుదలైన సాంగ్స్ యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. మరోవైపు ట్రైలర్, టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పెద్ది ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. తాజాగా చరణ్, శివన్న కలిసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ ఫోటో చూసి ఒకప్పుడు చిరంజీవి , కన్నడ హీరో కంఠీరవ రాజ్ కుమార్ అనుబంధం గురించి మాట్లాడుకుంటున్నారు.

ఎక్కువమంది చదివినవి : Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు.

టాలీవుడ్ హీరో చిరంజీవి, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మధ్య మంచి అనుబంధం ఉందన్న విషయం తెలిసిందే. మొదటి నుంచి రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం కొనసాగుతుంది. అయితే గతంలో రాజ్‌కుమార్‌ కుటుంబానికి చెందిన శ్రీ వజ్రేశ్వరీ కంబైన్స్‌ నిర్మాణ సంస్థ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో కంఠీరవ రాజ్ కుమార్, చిరంజీవి ఇద్దరూ ఆప్యాయంగా కలుసుకున్నారు. ఇక ఇప్పుడు చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంలో కంఠీరవ రాజ్ కుమార్ కుమారుడు శివరాజ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి, రాజ్ కుమార్ కలిసిన ఫోటోను చూపిస్తూ దానిని రీక్రియేట్ చేయాలని సదరు హోస్ట్ రిక్వెస్ట్ చేశారు. దీంతో శివన్న చరణ్ ను హాగ్ చేసుకుని ఆయనపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన స్టిల్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది..

ఇదిలా ఉంటే.. రాజ్ కుమార్ హీరోగా 1974లో వచ్చిన భక్త కుంబార చిత్రంలో జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి బాలనటిగా నటించారు. ఇప్పుడు శివరాజ్ కుమార్, రామ్ చరణ్, జాన్వీ కపూర్ కలిసి పెద్ది చిత్రంలో నటించడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

ఎక్కువమంది చదివినవి : Ammoru Movie: అమ్మోరు సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నా.. కారణం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : Suman Shetty : ఆ డైరెక్టర్ చెప్పడంతో హైదరాబాద్‏లో స్థలం కొని ఇల్లు కట్టాను.. ఇప్పుడు ధర ఎంతంటే.. సుమన్ శెట్టి..

Follow Us