AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీకృష్ణుడికి కుచేలుడు ఇచ్చిన కానుక.. మీ డైట్‌లో చేర్చుకున్నారంటే.. బరువు తగ్గించడంతో పాటు మీ గుండెను పదిలం!

అటుకులు కేవలం రుచికరమైన టిఫిన్ మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన పోషకాలను అందించే సంపూర్ణ ఆహారం. ఇందులో క్యాలరీలు తక్కువగా, పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఇది బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. అటుకులు చాలా తేలికగా జీర్ణమవుతాయి, కాబట్టి గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారికి ఇది సరైన ఎంపిక. బరువు తగ్గాలనుకునే వారికి, ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ కోరుకునే వారికి అటుకులు ఒక అద్భుతమైన ఆహారం. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, దీనిని ఎందుకు ఉత్తమమైన మీల్‌గా భావిస్తారో ఇక్కడ చూడండి:

Jyothi Gadda
|

Updated on: Mar 18, 2026 | 12:43 PM

Share
అటుకులను కూరగాయలు, వేరుశనగలు, నిమ్మరసంతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ఐరన్, ప్రోటీన్లు, విటమిన్లు అందుతాయి. మధుమేహం ఉన్నవారు కూడా పరిమితంగా అటుకులను తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. రక్తహీనతతో బాధపడేవారికి ఇది మేలు చేస్తుంది. ఉదయాన్నే తక్కువ సమయంలో, తక్కువ నూనెతో చేసుకునే ఈ వంటకం రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.

1 / 5
అటుకులు కడుపుకు చాలా హాయినిస్తాయి. ఇతర అల్పాహారాలతో పోలిస్తే ఇవి త్వరగా అరిగిపోతాయి, అందుకే అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా వీటిని తీసుకోవచ్చు. అటుకులను తయారు చేసే ప్రక్రియలో ఇవి ఐరన్ కంటెంట్‌ను పొందుతాయి. గర్భిణీలు, చిన్న పిల్లలు వీటిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.

2 / 5
అటుకుల్లో లాక్టోస్ ఉండదు. ఫ్యాట్, గ్లూటెన్ కూడా ఉండదు. గోధుమలతో తయారైన ఫుడ్ తింటే పడదు అనుకునే వారు అటుకులు హ్యాపీగా తినొచ్చు. వీటి వల్ల గుండెకి చాలా మంచిది. ఇన్‌స్టంట్‌గా మనకి ఎనర్జీ అందుతుంది. కడుపు నిండుగా అనిపిస్తుంది. బియ్యంతో తయారైన ఈ అటుకులు మనకి అన్నం తిన్నంత తృప్తిగా అనిపిస్తాయి.

3 / 5
ఇందులో కొవ్వు శాతం చాలా తక్కువ. ఒక కప్పు అటుకులలో తక్కువ క్యాలరీలు ఉంటాయి, పైగా ఇది తిన్న తర్వాత ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తుంది. అటుకులు రక్తంలోని చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచవు, కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు నిరభ్యంతరంగా తినవచ్చు.

4 / 5
దీనికి క్యారెట్, బఠానీలు, క్యాప్సికమ్ వంటి కూరగాయలు కలిపితే ఇది విటమిన్ల గనిగా మారుతుంది. అటుకులను ఎక్కువ సేపు నీళ్లలో నానబెట్టకుండా, కేవలం కడిగి వెంటనే వడకడితే అవి పొడిపొడిగా వస్తాయి.
చివరగా కొద్దిగా నిమ్మరసం పిండటం వల్ల అందులోని ఐరన్‌ను శరీరం త్వరగా గ్రహిస్తుంది.

దీనికి క్యారెట్, బఠానీలు, క్యాప్సికమ్ వంటి కూరగాయలు కలిపితే ఇది విటమిన్ల గనిగా మారుతుంది. అటుకులను ఎక్కువ సేపు నీళ్లలో నానబెట్టకుండా, కేవలం కడిగి వెంటనే వడకడితే అవి పొడిపొడిగా వస్తాయి. చివరగా కొద్దిగా నిమ్మరసం పిండటం వల్ల అందులోని ఐరన్‌ను శరీరం త్వరగా గ్రహిస్తుంది.

5 / 5
Follow Us