దేవేంద్ర ప్రధాన్ కృషి వల్లనే ఒడిశాలో బీజేపీ బలంగా ఎదిగింది: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
డాక్టర్ దేవేంద్ర ప్రధాన్ ఒడిశా బీజేపీకి భీష్మ పితామహుడు.. అని ఆయన కృషి వలనే నేడు ఒడిశాలో బీజేపీ బలంగా, సుసంపన్నంగా ఎదిగిందని.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. డాక్టర్ ప్రధాన్ మొదటి వర్ధంతి సందర్భంగా భువనేశ్వర్‌లోని ఓయూఏటీ క్యాంపస్‌లో జరిగిన సంతాప సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు.

డాక్టర్ దేవేంద్ర ప్రధాన్ ఒడిశా బీజేపీకి భీష్మ పితామహుడు.. అని ఆయన కృషి వలనే నేడు ఒడిశాలో బీజేపీ బలంగా, సుసంపన్నంగా ఎదిగిందని.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. డాక్టర్ ప్రధాన్ మొదటి వర్ధంతి సందర్భంగా భువనేశ్వర్‌లోని ఓయూఏటీ క్యాంపస్‌లో జరిగిన సంతాప సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తూ.. ఆయన సేవలను గుర్తుచేశారు. ఈ సందర్భంగా, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కళిందీ సమాల్ రచించిన ‘స్మృతిరే డాక్టర్ బాబు’ పుస్తకాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇతర ప్రముఖులు ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్, పలువురు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై డాక్టర్ దేవేంద్ర ప్రధాన్ స్ఫూర్తిదాయక జీవితాన్ని స్మరించుకున్నారు.

Rajminister Rajnath Singh Pays Tribute To Debendra Pradhan
తన జీవితాన్ని సమాజానికి అంకితం చేశారు..
డాక్టర్ దేవేంద్ర ప్రధాన్ ‘స్మృతి సభ’ను ఉద్దేశించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. “…కొద్ది కాలం క్రితం వరకు, రాజకీయ రంగంతో సంబంధం ఉన్నవారు నిజం మాట్లాడరనే ఒక భావన రాజకీయాల్లో ఉండేది. వారు చెప్పిన మాటను ఆచరించరని అనుకునేవారు; కానీ ఆ సమయంలో కూడా, రాజకీయాల ఔన్నత్యాన్ని నిలబెట్టిన కొందరు వ్యక్తులు ఉన్నారు.. వారిలో దివంగత దేవేంద్ర ప్రధాన్ ఒకరు.. మేమిద్దరం కలిసి పనిచేశాము… ఆయన తన జీవితాన్ని పూర్తిగా దేశానికి, సమాజానికి అంకితం చేశారు…” అని అన్నారు.
#WATCH | Bhubaneswar, Odisha: Addressing the ‘Smriti Sabha’ organised in Bhubaneswar on the first death anniversary of former Union Minister Dr Debendra Pradhan, Defence Minister Rajnath Singh says, “… Until a short while ago, there was a perception in politics that people… pic.twitter.com/LXnu7PHHhZ
— ANI (@ANI) March 17, 2026
ఒడిశాలో బీజేపీ అధికారంలోకి రావడంలో డాక్టర్ దేవేంద్ర ప్రధాన్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్.. డాక్టర్ ప్రధాన్‌తో కలిసి పనిచేసిన తన అనుభవాలను పంచుకున్నారు. దేవేంద్ర ప్రధాన్ మాటలకు, చేతలకు మధ్య ఎప్పుడూ తేడా లేదని ఆయన అన్నారు. ఆయన కష్టపడి పనిచేసే, విజయవంతమైన, సున్నితమైన వ్యక్తి.. అని.. ఆయన కృషి వల్లే ఒడిశాలో బీజేపీ బలమైన స్థానానికి చేరుకుందన్నారు.
సామాన్య నేపథ్యం నుంచి అగ్రస్థానానికి దేవేంద్ర ప్రధాన్ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అన్నారు. ఆయన బీజేపీ సంస్థను బలోపేతం చేయడానికి తీవ్రంగా కృషి చేశారని.. ఆయన కృషి ఫలితంగానే నేడు ఒడిశాలో బీజేపీ అధికారంలో ఉందన్నారు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే సత్తా ఆయనకుందని.. తన ఆదర్శాల విషయంలో ఎన్నడూ రాజీపడలేదని తెలిపారు. దేవేంద్ర ప్రధాన్ తమకు మార్గదర్శి అని, ఆయన త్యాగం, తపస్సు, కఠోర శ్రమలకు ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
