AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఇద్దరి వల్లే ఓడాం.. వెన్నంటూ ఉంటూ వెన్నుపోటు పోడిచారు..

Australia vs Bangladesh Darwin Test: ఒకప్పుడు అజేయ శక్తిగా వెలుగొందిన ఆస్ట్రేలియా జట్టుకు ఈ పరాభవం పెద్ద మేల్కొలుపు లాంటిది. మెకే వేదికగా జరిగే తదుపరి మ్యాచ్‌లో కమిన్స్ సేన తిరిగి పుంజుకుంటుందో లేక బంగ్లాదేశ్ మరో సంచలనంతో సిరీస్ కైవసం చేసుకుంటుందో వేచి చూడాలి.

ఆ ఇద్దరి వల్లే ఓడాం.. వెన్నంటూ ఉంటూ వెన్నుపోటు పోడిచారు..
Australia Vs Bangladesh Darwin Test
Venkata Chari
|

Updated on: Aug 16, 2026 | 3:04 PM

Share

Australia vs Bangladesh Darwin Test: సొంతగడ్డపై పసికూన బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన 9 వికెట్ల ఘోర పరాభవం ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసింది. చరిత్రలోనే తొలిసారి ఎదురైన ఈ అవమానకర ఓటమిపై ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తొలి రోజే పేకమేడలా కూలిన బ్యాటింగ్ వైఫల్యమే ఈ ఘోర పరాజయానికి ప్రధాన కారణమంటూ కొందరు సీనియర్ బ్యాటర్లపై తన అసహనాన్ని పరోక్షంగా బయటపెట్టాడు.

కంగారూల గడ్డపై బంగ్లాదేశ్ సరికొత్త చరిత్ర..

డార్విన్ వేదికగా ముగిసిన తొలి టెస్టు పోరులో బంగ్లాదేశ్ జట్టు అద్భుత ప్రదర్శనతో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఆస్ట్రేలియాపై ఇప్పటివరకు ఒక్క విజయం కూడా నమోదు చేయని బంగ్లాదేశ్, ఈసారి ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి ప్రపంచ క్రికెట్‌ను విస్మయానికి గురిచేసింది.

ఎక్కువమంది చదివినది: IND vs ENG: ప్రపంచ రికార్డ్‌తో వైభవ్ బీభత్సం గుర్తుందా.. బుడ్డోడి ఊచకోతకు బలైన ఇంగ్లాండ్..!

ఇవి కూడా చదవండి

కంగారూలను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి చారిత్రక ఘనతను లిఖించింది. ఈ అనూహ్య పరాభవం ఆస్ట్రేలియా జట్టులో తీవ్ర కలకలం రేపింది. అన్ని రంగాల్లోనూ బలహీనంగా కనిపించిన ఆతిథ్య జట్టు ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తొలి రోజే మునిగిన ఆసీస్ నావ..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టుకు మొదటి రోజే భారీ ఎదురుదెబ్బ తగిలింది. పిచ్ పరిస్థితులను అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైన ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 198 పరుగులకే కుప్పకూలడం మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. దీనిపై కెప్టెన్ పాట్ కమిన్స్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ దిగినప్పుడు క్రీజులో ఎక్కువ సమయం నిలబడాల్సిన బాధ్యత బ్యాటర్లపై ఉందని అతడు స్పష్టం చేశాడు. తొలి రోజు పిచ్ నుంచి లభించిన సహకారాన్ని ప్రత్యర్థి బౌలర్లు చక్కగా సద్వినియోగం చేసుకున్నారని, ఒత్తిడిని అధిగమించి భారీ స్కోర్లు చేయడంలో తమ బ్యాటింగ్ విభాగం ఘోరంగా విఫలమైందని అతడు అంగీకరించాడు.

ఇద్దరు స్టార్ ఆటగాళ్లపై వేలాడుతున్న కత్తి..

పాట్ కమిన్స్ ఏ ఒక్క ఆటగాడి పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, అతడి వ్యాఖ్యలన్నీ టాపార్డర్ వైఫల్యం చుట్టూనే తిరిగాయి. వరుసగా నిరాశపరుస్తున్న మార్నస్ లబుషేన్, జేక్ వెదరాల్డ్ ఆటతీరుపై ఇప్పుడు సర్వత్రా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాజీ ఆటగాడు కెర్రీ ఓకీఫ్ సైతం వీరిద్దరి వైఫల్యాలను ఎత్తిచూపాడు. తమను తాము నిరూపించుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా వీరికిచ్చిన అవకాశాలు దాదాపు ముగిసిపోయాయని అతడు వ్యాఖ్యానించాడు.

ఎక్కువమంది చదివినది: 41 సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్‌తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా..!

గతేడాది జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఓటమి అనంతరం లబుషేన్ జట్టులో తన పట్టును కోల్పోయాడు. 2024 నుంచి ఇప్పటివరకు ఆడిన 36 ఇన్నింగ్స్‌లలో ఒక్క సెంచరీ కూడా చేయలేక కేవలం 26.5 సగటుతో మాత్రమే పరుగులు సాధించాడు. మరోవైపు గత ఏడాది యాషెస్ సిరీస్ అరంగేట్రం చేసిన జేక్ వెదరాల్డ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కేవలం 20.4 సగటుతో కొట్టుమిట్టాడుతున్న అతడి స్థానం తీవ్ర ప్రమాదంలో పడింది.

మెకే పోరు ఆఖరి అవకాశమా?

రాబోయే అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాతో జరగనున్న కీలక సిరీస్‌కు ముందే ఆస్ట్రేలియా జట్టు తమ లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మెకే వేదికగా జరగనున్న రెండో టెస్టు లబుషేన్, వెదరాల్డ్‌లకు చావో రేవో లాంటిది. ఈ మ్యాచ్‌లో కనుక ఈ ఇద్దరు బ్యాటర్లు చెలరేగి భారీ ఇన్నింగ్స్‌లు ఆడకపోతే వారి టెస్ట్ కెరీర్‌కు తెరపడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ ఇద్దరి వల్లే ఓడాం.. వెన్నంటూ ఉంటూ వెన్నుపోటు పోడిచారు
ఆ ఇద్దరి వల్లే ఓడాం.. వెన్నంటూ ఉంటూ వెన్నుపోటు పోడిచారు
నేను డల్ గా ఉన్నప్పుడు ప్రతిసారి ఆ హీరో నుంచి మెసేజ్ వస్తుంది
నేను డల్ గా ఉన్నప్పుడు ప్రతిసారి ఆ హీరో నుంచి మెసేజ్ వస్తుంది
రైతులకు కేంద్రం సూపర్ న్యూస్. ఒకేసారి 5 పథకాలు
రైతులకు కేంద్రం సూపర్ న్యూస్. ఒకేసారి 5 పథకాలు
పెళ్లయ్యాకే తిరిగిన జాతకం.. 9 వికెట్లతో చెలరేగిన బంగ్లా పేసర్
పెళ్లయ్యాకే తిరిగిన జాతకం.. 9 వికెట్లతో చెలరేగిన బంగ్లా పేసర్
బామ్మ వర్సెస్ కోతి ఫైట్.. నవ్వి నవ్వి పోతే మాకు సంబంధం లేదు!
బామ్మ వర్సెస్ కోతి ఫైట్.. నవ్వి నవ్వి పోతే మాకు సంబంధం లేదు!
కొత్త వాహనం కొంటే పూజ ఎందుకు చేస్తారు? వాహన పూజ వెనుక ఉన్న అసలు..
కొత్త వాహనం కొంటే పూజ ఎందుకు చేస్తారు? వాహన పూజ వెనుక ఉన్న అసలు..
కాకినాడ చిన్నారి జాహ్నవి ఇంటికి వచ్చిన కొత్త నేస్తం.. ఎవరో తెలుసా
కాకినాడ చిన్నారి జాహ్నవి ఇంటికి వచ్చిన కొత్త నేస్తం.. ఎవరో తెలుసా
వార్నీ.. ఒకే దేశంలో 20 లక్షలకు పైగా సరస్సులా.. ఈ అద్భుతం ఎక్కడ..
వార్నీ.. ఒకే దేశంలో 20 లక్షలకు పైగా సరస్సులా.. ఈ అద్భుతం ఎక్కడ..
తిరుమలలో సులభంగా రూమ్స్ పొందటం ఎలా..?
తిరుమలలో సులభంగా రూమ్స్ పొందటం ఎలా..?
సూర్యాస్తమయం తర్వాత శివలింగానికి జలాభిషేకం చేయవచ్చా? శాస్త్రాలు..
సూర్యాస్తమయం తర్వాత శివలింగానికి జలాభిషేకం చేయవచ్చా? శాస్త్రాలు..