AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు వాడే కొబ్బరినూనె అసలైనదా.. కల్తీదా..? చిటికెలో ఇలా కనిపెట్టండి..

ప్రస్తుత కాలంలో కొబ్బరి నూనెకు డిమాండ్ భారీగా పెరిగింది. గతంలో గ్రామాల్లో ఇళ్ల వద్దనే కొబ్బరికాయలను కొట్టి, ఎండబెట్టి ఆడించి స్వచ్ఛమైన కొబ్బరి నూనెను తయారు చేసుకునేవారు. అయితే నేటి బిజీ లైఫ్, కొబ్బరికాయల కొరత వల్ల నగరాల్లో డబ్బాల వాడకం బాగా పెరిగిపోయింది. అయితే ఇదే సమయంలో నకిలీ కొబ్బరి నూనెలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కల్తీ నూనెను ఎలా గుర్తించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Aug 16, 2026 | 3:09 PM

Share
డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటున్న కొందరు అక్రమార్కులు తక్కువ ధరలతో కల్తీ నూనెలను విక్రయిస్తూ సామాన్యుల ఆరోగ్యంపై దెబ్బకొడుతున్నారు. తక్కువ ధరకు వస్తుందని కొనే ఇలాంటి కల్తీ నూనెలను వాడటం వల్ల చర్మ సమస్యలు, జుట్టు రాలడం మాత్రమే కాకుండా వంటల్లో వాడితే దీర్ఘకాలిక జీర్ణకోశ, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 / 5
ఈ నేపథ్యంలో మనం కొనుగోలు చేసే కొబ్బరి నూనె స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవడానికి కిచెన్‌లోనే సులభంగా చేసుకునే మొదటి పరీక్ష ఫ్రిడ్జ్ టెస్ట్. ఒక చిన్న గాజు సీసాలో కొద్దిగా కొబ్బరి నూనెను తీసుకుని, దాదాపు 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. కొబ్బరి నూనె సహజ లక్షణం ప్రకారం అది పూర్తిగా తెల్లగా మారి, గట్టిగా గడ్డకడితే అది 100 శాతం స్వచ్ఛమైనదని అర్థం. ఒకవేళ నూనెలో సగం మాత్రమే గడ్డకట్టి, మిగిలిన భాగం ద్రవ రూపంలోనే ఉండిపోతే అందులో ఇతర చౌక నూనెలు లేదా రసాయనాలు కలిపారని స్పష్టమవుతుంది.

2 / 5
రెండోది నీటి పరీక్ష. ఒక గాజు గ్లాసులో స్వచ్ఛమైన నీటిని తీసుకుని, అందులో రెండు చుక్కల కొబ్బరి నూనెను వేయాలి. స్వచ్ఛమైన కొబ్బరి నూనె సాంద్రత తక్కువగా ఉండటం వల్ల నీటిపై చుక్కలా తేలియాడుతుంది. అలా కాకుండా నూనె నీటిలో కలిసిపోవడానికి ప్రయత్నించినా, లేదా నీటి అడుగుభాగానికి మునిగిపోయినా అది కల్తీ నూనె అని తేలికగా గుర్తించవచ్చు.

3 / 5
మూడో పద్ధతి నూనె వాసన, వేడి చేసే పరీక్ష. స్వచ్ఛమైన కొబ్బరి నూనెకు సహజసిద్ధమైన పచ్చి లేదా ఎండు కొబ్బరి యొక్క తీపి, ఘాటైన వాసన ఉంటుంది. ఎలాంటి వాసన లేకపోయినా లేదా రసాయన వాసన వచ్చినా దాన్ని వాడకూడదు. అలాగే ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నూనె పోసి తక్కువ మంటపై వేడి చేసినప్పుడు స్వచ్ఛమైన నూనె నుంచి ఎలాంటి నల్లటి పొగ లేదా మాడిన వాసన రాదు. కల్తీ నూనె అయితే వేడి తగలగానే తీవ్రమైన పొగ రావడంతో పాటు దుర్వాసన వెదజల్లుతుంది.

4 / 5
కొబ్బరి నూనె నాణ్యత ఎక్కువ కాలం నిలిచి ఉండాలంటే దానిని నిల్వ చేసే విధానం కూడా చాలా ముఖ్యం. కొబ్బరి నూనెను ఎప్పుడూ ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా గాలి చొరబడని స్వచ్ఛమైన గాజు సీసాలలోనే భద్రపరచాలి. తేమ, నేరుగా సూర్యకాంతి తగలకుండా పొడి ప్రదేశంలో ఉంచడం వల్ల నూనెలోని పోషకాలు, సహజ గుణాలు పాడవకుండా ఉంటాయి.

5 / 5
Follow Us
మీరు వాడే కొబ్బరినూనె అసలైనదా.. కల్తీదా..?

పిల్లబచ్చాలు.. పెద్దపులిని వాళ్ల గడ్డపైనే ఎలా ఓడించారు?

ఆ ఇద్దరి వల్లే ఓడాం.. వెన్నంటూ ఉంటూ వెన్నుపోటు పోడిచారు

నేను డల్ గా ఉన్నప్పుడు ప్రతిసారి ఆ హీరో నుంచి మెసేజ్ వస్తుంది

రైతులకు కేంద్రం సూపర్ న్యూస్. ఒకేసారి 5 పథకాలు

పెళ్లయ్యాకే తిరిగిన జాతకం.. 9 వికెట్లతో చెలరేగిన బంగ్లా పేసర్

బామ్మ వర్సెస్ కోతి ఫైట్.. నవ్వి నవ్వి పోతే మాకు సంబంధం లేదు!

కొత్త వాహనం కొంటే పూజ ఎందుకు చేస్తారు? వాహన పూజ వెనుక ఉన్న అసలు..

కాకినాడ చిన్నారి జాహ్నవి ఇంటికి వచ్చిన కొత్త నేస్తం.. ఎవరో తెలుసా

వార్నీ.. ఒకే దేశంలో 20 లక్షలకు పైగా సరస్సులా.. ఈ అద్భుతం ఎక్కడ..