AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బామ్మ వర్సెస్ కోతి ఫైటింగ్‌ చూస్తే పొట్ట చెక్కలే..నవ్వి నవ్వి పోతే మాకు సంబంధం లేదు..!

సోషల్ మీడియాలో ఒక వృద్ధురాలు, కోతి మధ్య జరిగిన తమాషా ఫైటింగ్‌కు సంబంధించిన వీడియో హల్‌చల్ చేస్తోంది. రోడ్డు పక్కన కూర్చున్న కోతిని భయపెట్టి వెళ్లగొట్టేందుకు ఒక అవ్వ చేసిన సాహసం నెటిజన్లను తెగ నవ్వించేస్తోంది. చేతిలో ఇటుక రాయి పట్టుకుని వానరాన్ని బెదిరించబోయిన అవ్వను ఆ కోతి ముప్పు తిప్పలు పెట్టింది. ముసలవ్వ చేతిలో దెబ్బలు తినకుండా ఉండేందుకు ఆ కోతి చేసిన విన్యాసాలు మామూలుగా లేదు.. అక్కడే ఉన్న బైక్‌లు, స్కూటర్ల వెనుక దాక్కుంటూ కోతి ఆ బామ్మను భలేగా ఆటపట్టించింది. ఈ సరదా పోరును చూసి నెటిజన్లు నవ్వులు పూయిస్తున్నారు.

బామ్మ వర్సెస్ కోతి ఫైటింగ్‌ చూస్తే పొట్ట చెక్కలే..నవ్వి నవ్వి పోతే మాకు సంబంధం లేదు..!
Grandma Vs Monkey
Jyothi Gadda
|

Updated on: Aug 16, 2026 | 2:49 PM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ అనేక విచిత్రమైన, సరదా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులు, మనుషుల మధ్య జరిగే వినోదాత్మక సంఘటనలకు నెటిజన్ల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. తాజాగా ఒక వృద్ధురాలు, ఒక కోతి మధ్య జరిగిన విచిత్రమైన ఫైటింగ్‌ వీడియో ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం.. ఒక వీధి చివరన రోడ్డు పక్కన కోతి ప్రశాంతంగా కూర్చుని ఉంటుంది. దానిని అక్కడ నుంచి వెళ్లగొట్టాలని భావించిన ఒక వృద్ధురాలు చేతిలో ఇటుక రాయి పట్టుకుని దాని వైపు వెళ్తుంది. రాయి చూపిస్తే కోతి భయపడి పారిపోతుందని ఆ బామ్మ భావించింది. కానీ, అక్కడున్నది సాధారణ కోతి కాదు కదా! ఆ కోతి బామ్మ బెదిరింపులకు అస్సలు భయపడలేదు. పైగా వెనక్కి తగ్గకుండా, ఆ బామ్మ చుట్టూనే తిరుగుతూ ఆమెను కంగారు పెట్టడం ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

ఇటుక రాయితో పని కాకపోవడంతో ఆ వృద్ధురాలు వెంటనే సమీపంలో ఉన్న మరొక మహిళ వద్ద నుంచి ఒక పొడవైన కర్రను తీసుకుంటుంది. కర్రతో కోతిని భయపెట్టాలని ఆమె మళ్లీ ప్రయత్నించగా, ఈసారి కోతి ఊహించని రీతిలో స్పందించింది. బెదిరిపోవడానికి బదులుగా ఆ కోతి నేరుగా ఆ కర్రపైకే ఎక్కి, అవ్వకు దగ్గరగా వచ్చేసింది. అంతటితో ఆగకుండా బామ్మ చీరను పట్టుకుని లాగడం మొదలుపెట్టింది. దీంతో కంగారు పడిన బామ్మ వెనక్కి తగ్గుతూ తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేసింది.

ఈ వీడియోలో అత్యంత వినోదాత్మకమైన ఘట్టం ఏమిటంటే.. ఆ కోతి రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న బైక్‌లు, స్కూటర్లు, కార్ల వెనుక దాక్కుంటూ బామ్మతో దాగుడుమూతలు ఆడింది. బామ్మ ఒకవైపు నుంచి దానిని తరిమేందుకు వస్తే, కోతి ఇంకోవైపు నుంచి వచ్చి ఆమెను ఆటపట్టించింది. ఎంత ప్రయత్నించినా ఆ కోతిని అక్కడ నుంచి వెళ్లగొట్టడం ఆ వృద్ధురాలి వల్ల కాలేదు.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ సరదా ఘటనా దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఎక్స్ వేదికగా వేలాది మంది ఈ వీడియోను షేర్ చేస్తూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. బామ్మ కోతితో తప్పుడు పంగా తీసుకుంది, బామ్మ మొండిదైతే.. కోతి అంతకంటే పెద్ద మొండిది, ఇది అసలైన బామ్మ వర్సెస్ కోతి డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్ అంటూ నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‌లో నిలిచింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us