AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1947లో రూ. 5000లతో బంగారం కొనుగోలు చేసి ఉంటే…సరిగ్గా 2026 ఆగస్టు 15 నాటికి దాని విలువ ఎంతో తెలుసా..?

గత కొన్నేళ్లుగా బంగారం ధరలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో బంగారం ధర కొత్త గరిష్ఠ స్థాయికి కూడా చేరింది. నేడు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, ఒకప్పుడు 10 గ్రాముల బంగారం ధర రూ. 100 కన్నా తక్కువగా ఉండేదని మీకు తెలుసా? భారతదేశం 2026 ఆగస్టు 15న తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఇలాంటి తరుణంలో, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర ఎంత ఉండేదో తెలిస్తే షాక్‌ అవుతారు.

1947లో రూ. 5000లతో బంగారం కొనుగోలు చేసి ఉంటే...సరిగ్గా 2026 ఆగస్టు 15 నాటికి దాని విలువ ఎంతో తెలుసా..?
1947 Gold PriceImage Credit source: AI image
Jyothi Gadda
|

Updated on: Aug 15, 2026 | 5:16 PM

Share

భారతదేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం సిద్ధించింది. నాడు మనం పొందినది కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు, దేశ ఆర్థిక ప్రయాణంలో కూడా అది ఒక నూతన శకానికి నాంది పలికింది. ఆ సమయం నుండి నేటి వరకు గత ఏడు దశాబ్దాల పైచిలుకు కాలంలో అనేక వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా భారతీయులు అత్యంత పవిత్రంగా, సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం సాధించిన వృద్ధి అపారమైనది. స్వాతంత్య్ర దినోత్సవం వేళ, నాటి బంగారం ధరలు, నేటి వాటి విలువను ఒక్కసారి పరిశీలిద్దాం.

1947 నాటి బంగారం ధర ఎంత?:

1947లో భారత్ స్వతంత్ర దేశంగా అవతరించినప్పుడు 10 గ్రాముల (తులం) 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.88.62 మాత్రమే. ఆ సమయంలో సామాన్యుడి నెలవారీ ఆదాయం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, బంగారం వెల నేటి ధరలతో పోలిస్తే ఊహించని విధంగా తక్కువగా ఉండేది. కాలక్రమేణా, ద్రవ్యోల్బణం, ప్రజల ఆదాయం పెరిగేకొద్దీ రూపాయి విలువ తగ్గుతుంది. గత 80 ఏళ్లలో బంగారం ధర 1700 రెట్లకు పైగా పెరిగింది.

నాటి రూ.5,000 విలువ నేడు ఎంత?:

ఒకవేళ 1947లో ఎవరైనా నాటి రూ. 5,000 నగదును బంగారంలో పెట్టుబడి పెట్టి ఉంటే, ఆ గణాంకాలు ఇప్పుడు షాక్‌ అయ్యేలా చేస్తాయి. ఈ రోజు మీరు 1 గ్రాము కూడా రూ. 5,000లకు కొనలేరు. కానీ, 1947లో మీరు ఈ డబ్బుతో 500 గ్రాముల కంటే ఎక్కువ బంగారం కొనుండవచ్చు. ఆ సమయంలో మీ కుటుంబ పెద్దలు బంగారంలో కొద్దిగా పెట్టుబడి పెట్టి ఉన్నా,పెట్టుబడిఒకవేళ అలా జరిగి ఉంటే, ఈ రోజు దాని విలువ కోట్లలో ఉండేది. ఈ కాలంలో బంగారం ధర 1726 రెట్లు పెరిగింది. అంటే, 1947లో తులం ధర రూ.88.62 చొప్పున, రూ.5,000 కు సుమారు 564.2 గ్రాముల (56 తులాలకు పైగా) బంగారం వచ్చేది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉన్నాయి:

ప్రస్తుతం బంగారం, వెండి ధరలలో తీవ్ర హెచ్చుతగ్గులు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ, ఈరోజు తగ్గుదల కనిపిస్తోంది. ఈ తగ్గుదల తర్వాత కూడా, 10 గ్రాముల బంగారం ధర రూ. 1,52,000 పైనే ఉంది.

పసిడి – సంపద రక్షణ కవచం:

భారతదేశంలో బంగారాన్ని కేవలం పెట్టుబడి కోసమే కాకుండా, సంప్రదాయం కోసం కూడా కొనుగోలు చేస్తారు. దీపావళి, అక్షయ తృతీయ వంటి ప్రత్యేక పండుగల సందర్భంగా బంగారం కొనడం చాలా కుటుంబాలలో ఒక సంప్రదాయంగా ఉంది. ఇది కాకుండా, వివాహ వార్షికోత్సవాలు, పుట్టినరోజులు, అనేక ఇతర పండుగల సందర్భంగా బంగారం కొనుగోలు చేసే ఆచారం సంవత్సరాలుగా కొనసాగుతోంది. ప్రస్తుతం, సామాన్య ప్రజలు బంగారం, వెండి ధరలు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్నారు.

ఈ గణాంకాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సంక్షోభ సమయాల్లో ఎంతటి ఆర్థిక హెచ్చుతగ్గులు వచ్చినా, బంగారం తన కొనుగోలు శక్తిని కోల్పోకుండా సంపదను కాపాడుతూనే వచ్చింది. అందుకే తరతరాలుగా భారతీయుల మొదటి ప్రాధాన్యత కలిగిన పెట్టుబడి మార్గంగా పసిడి నిలుస్తోంది!

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us