AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవి తింటే నర నరాల్లో బలం ఫుల్లు.. ఏడాదికి సరిపడా విటమిన్ డి దొరుకుతుంది

ప్రకృతిలో లభించే ప్రతిదాన్ని ఆరోగ్యం కోసం ఉపయోగించుకోవచ్చు. వాటిలో ఇవి కూడా ఒకటి. చాలా మందికి తెలియదు ఇవి శాకాహారమా లేదా మాంసాహారమా అని. ఫంగస్‌తో తయారైనప్పటికీ, అవి శాకాహారం కిందకే వస్తాయి. ప్రస్తుతం ఇవి ప్రధానంగా రెండు రకాలుగా లభిస్తున్నాయి.

Prasanna Yadla
|

Updated on: Sep 27, 2026 | 12:30 PM

Share
నాటు పుట్టగొడుగుల్లో 33 కిలో క్యాలరీలు, బటన్ మష్రూమ్స్‌లో 22 కిలో క్యాలరీలు ఉంటాయి. ఇవి తక్కువ క్యాలరీల కూరగాయలతో సమానం, అధిక శక్తిని అందించవు. కార్బోహైడ్రేట్స్: నాటు పుట్టగొడుగుల్లో 6 గ్రాములు, బటన్ మష్రూమ్స్‌లో 4 గ్రాములు, ప్రోటీన్: నాటు పుట్టగొడుగుల్లో 3.3 గ్రాములు, బటన్ మష్రూమ్స్‌లో 3 గ్రాములు, కొవ్వు: నాటు పుట్టగొడుగుల్లో 0.5 గ్రాములు, బటన్ మష్రూమ్స్‌లో 0.3 గ్రాములు, ఫైబర్: నాటు పుట్టగొడుగుల్లో 2.3 గ్రాములు, బటన్ మష్రూమ్స్‌లో 1 గ్రాము.

1 / 5
మన శరీరానికి రోజుకు 2.4 మైక్రోగ్రాముల విటమిన్ బి12 అవసరం. బటన్ మష్రూమ్స్‌లో 1.5 మైక్రోగ్రాముల వరకు లభించగా, నాటు పుట్టగొడుగుల్లో 3 నుంచి 4 మైక్రోగ్రాముల వరకు లభిస్తుంది. శాకాహారులకు విటమిన్ బి12 లోపం సాధారణం కాబట్టి, పుట్టగొడుగులు ఈ లోపాన్ని సవరించడానికి ఒక అద్భుతమైన వనరు.

2 / 5
విటమిన్ డి సాధారణంగా ఏ ఆహారంలోనూ ఎక్కువగా లభించదు, ముఖ్యంగా శాకాహారాల్లో చాలా అరుదు. కానీ పుట్టగొడుగులు విటమిన్ డికి గొప్ప వనరు. నాటు పుట్టగొడుగుల్లో 2693 నానోగ్రాములు, బటన్ మష్రూమ్స్‌లో 1000 నానోగ్రాములు విటమిన్ డి లభిస్తుంది.
పుట్టగొడుగుల్లో ఉండే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్,  బీటా గ్లూకాన్స్ ప్రేగుల్లోని మంచి బ్యాక్టీరియాను ఉపయోగించుకుని, మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తాయి.

విటమిన్ డి సాధారణంగా ఏ ఆహారంలోనూ ఎక్కువగా లభించదు, ముఖ్యంగా శాకాహారాల్లో చాలా అరుదు. కానీ పుట్టగొడుగులు విటమిన్ డికి గొప్ప వనరు. నాటు పుట్టగొడుగుల్లో 2693 నానోగ్రాములు, బటన్ మష్రూమ్స్‌లో 1000 నానోగ్రాములు విటమిన్ డి లభిస్తుంది. పుట్టగొడుగుల్లో ఉండే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, బీటా గ్లూకాన్స్ ప్రేగుల్లోని మంచి బ్యాక్టీరియాను ఉపయోగించుకుని, మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తాయి.

3 / 5
పుట్టగొడుగులలోని గ్యాలిక్ యాసిడ్, క్లోరోజనిక్ యాసిడ్, బీటా గ్లూకాన్స్ గుండె రక్తనాళాలకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి రక్తనాళాల గోడలపై కొలెస్ట్రాల్ పేరుకోకుండా, కొవ్వు నిల్వలు ఏర్పడకుండా, రక్తనాళాల్లో వాపు (ఇన్ఫ్లమేషన్) రాకుండా రక్షిస్తాయి. అలాగే, రక్తం గడ్డకట్టకుండా, ప్లేట్‌లెట్స్ పేరుకోకుండా నివారిస్తాయి, తద్వారా హార్ట్ ఎటాక్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండె జబ్బులు ఉన్నవారికి, స్టంట్స్ లేదా బైపాస్ చేయించుకున్న వారికి ఇవి చాలా మంచివి.

4 / 5
డయాబెటిస్ ఉన్నవారిపై జరిపిన అధ్యయనాల్లో, ఏడు రోజుల పాటు రోజుకు 150 గ్రాముల పుట్టగొడుగులను తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 22% తగ్గినట్లు గుర్తించారు. పుట్టగొడుగుల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటం వల్ల ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు సురక్షితమైన ఆహారం. క్లోరోజనిక్ యాసిడ్, గ్యాలిక్ యాసిడ్, నారింజెనిన్ వంటివి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.

5 / 5
Follow Us