AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నది ఉధృతిలో కొట్టుకుపోయిన ఏనుగు పిల్ల.. ప్రాణాలకు తెగించి రక్షించిన మత్స్యకారులు..

మనుషుల్లో ఇంకా మానవత్వం సజీవంగానే ఉందనడానికి నిదర్శనంగా నిలిచే సంఘటనలు తరచూ వెలుగు చూస్తుంటాయి. తాజాగా అలాంటి ఒక భావోద్వేగ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని తీస్తా నది తీరంలో చోటుచేసుకుంది. తీస్తా నది ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక చిన్న ఏనుగు పిల్లను స్థానిక మత్స్యకారులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రక్షించి, తిరిగి దాని తల్లి ఒడికి చేర్చిన తీరు అందరినీ కదలిస్తోంది.

నది ఉధృతిలో కొట్టుకుపోయిన ఏనుగు పిల్ల.. ప్రాణాలకు తెగించి రక్షించిన మత్స్యకారులు..
Teesta River Elephant Rescue
Jyothi Gadda
|

Updated on: Sep 27, 2026 | 12:28 PM

Share

తీస్తా నది ఉధృత ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక ఏనుగు పిల్లను స్థానిక మత్స్యకారులు చాకచక్యంగా రక్షించిన హృదయ విదారక సంఘటన నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. నది దాటుతున్న సమయంలో ప్రవాహ హోరుకు తన గుంపు నుండి విడిపోయిన ఆ ఏనుగు పిల్ల కొట్టుకుపోతుండగా, ప్రాణాలకు తెగించి మత్స్యకారులు దానిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అడవి గుండా ప్రవహించే తీస్తా నదిని దాటేందుకు ఏనుగుల గుంపు ప్రయత్నించింది. ఆ సమయంలో నదిలో నీటి ఉధృతి చాలా ఎక్కువగా ఉండటంతో, గుంపులోని ఒక చిన్న ఏనుగు పిల్ల ప్రవాహాన్ని తట్టుకోలేక కొట్టుకుపోయింది. తన గుంపు, తల్లి ఏనుగు కళ్లముందే ఆ ఏనుగు గున్న ప్రవాహ హోరులో కొట్టుకుపోతూ రక్షణ కోసం విలవిలలాడింది.

ఆ సమయంలో నది ఒడ్డున చేపల వేటలో ఉన్న స్థానిక మత్స్యకారులు ఆ దృశ్యాన్ని గమనించారు. ప్రవాహం చాలా వేగంగా ఉన్నప్పటికీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారు పడవల్లో నదిలోకి వెళ్లారు. భయంతో వణుకుతున్న ఆ చిన్న ఏనుగు పిల్లను ఎంతో చాకచక్యంగా తాడు, చేతుల సహాయంతో పట్టుకుని, సురక్షితంగా నది ఒడ్డుకు చేర్చారు.

ఏనుగు పిల్లను ఒడ్డుకు తీసుకవచ్చిన వెంటనే మత్స్యకారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఆ ఏనుగు గున్నకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, అది ఆరోగ్యంగానే ఉందని ధృవీకరించుకున్నారు. అనంతరం అడవి పరిసర ప్రాంతాల్లో గాలించి, ఆ పిల్ల కోసం వెతుకుతున్న తల్లి ఏనుగు, దాని గుంపు వద్దకు ఈ చిన్నారి ఏనుగును సురక్షితంగా చేర్చారు.

ఇవి కూడా చదవండి

తన బిడ్డ తిరిగి రావడంతో ఆ తల్లి ఏనుగు వ్యక్తంచేసిన ఆనందం, బిడ్డను అటవీ శాఖ అధికారులు తల్లి వద్దకు వదిలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక ప్రాణాన్ని కాపాడిన మత్స్యకారుల సాహసాన్ని, మానవత్వాన్ని నెటిజన్లు, జంతు ప్రేమికులు ఎంతో కొనియాడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us