AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.10 వేల జీతం వివాదం.. రూ.24 కోట్ల ఆస్తి నష్టం.. టెక్స్‌టైల్ మిల్లు అగ్నిప్రమాదం వెనుక పక్కాప్లాన్ తెలిస్తే..!

చిన్నపాటి కోపం, కక్ష సాధింపు చర్యలు కొన్నిసార్లు ఎంతటి దారుణమైన నష్టానికి దారితీస్తాయో నిరూపించే ఘటన గుజరాత్‌లోని వస్త్ర వ్యాపార కేంద్రమైన సూరత్‌లో వెలుగుచూసింది. కేవలం రూ.10,000 జీతం ఇవ్వలేదనే కారణంతో ఒక మాజీ ఉద్యోగి చేసిన పనికి, ఒక టెక్స్‌టైల్ మిల్లులో ఏకంగా రూ.24 కోట్ల విలువైన ఆస్తి బూడిదైపోయింది. అసలేం జరిగింది..? పూర్తి వివరాల్లోకి వెళితే..

రూ.10 వేల జీతం వివాదం.. రూ.24 కోట్ల ఆస్తి నష్టం.. టెక్స్‌టైల్ మిల్లు అగ్నిప్రమాదం వెనుక పక్కాప్లాన్ తెలిస్తే..!
Surat Textile Market Fire
Jyothi Gadda
|

Updated on: Sep 27, 2026 | 11:28 AM

Share

గుజరాత్‌లోని సూరత్‌లో కేవలం రూ.10,000 జీతం బకాయి వివాదం ఏకంగా రూ.24 కోట్ల నష్టానికి దారితీసింది. టెక్స్‌టైల్ మిల్లు యజమాని తన జీతాన్ని సకాలంలో ఇవ్వలేదని ఆగ్రహించిన మాజీ ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా మిల్లుకు నిప్పు పెట్టాడు. ఈ ప్రమాదంలో భారీగా దాచి ఉంచిన వస్త్రాలు, విలువైన యంత్రాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. కేవలం చిన్న వివాదం వల్ల ఇంత పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరగడం, అనేకమంది ఉపాధి ప్రమాదంలో పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సూరత్‌లోని ఒక ప్రముఖ టెక్స్‌టైల్ మిల్లులో నిందితుడు గతంలో పనిచేసేవాడు. పని మానేసిన తర్వాత అతనికి రావాల్సిన జీతం బకాయి రూ.10,000 విషయంలో మిల్లు యజమానికి, అతనికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తన డబ్బులు తనకు వెంటనే ఇవ్వాలని అతడు ఒత్తిడి చేసినప్పటికీ, యజమాని సకాలంలో చెల్లించలేదు. దీంతో యజమానిపై తీవ్ర కక్ష పెంచుకున్న ఆ మాజీ ఉద్యోగి, ఎలాగైనా అతనికి కోలుకోలేని దెబ్బ తీయాలని కుట్ర పన్నాడు.

ఇవి కూడా చదవండి

అర్ధరాత్రి ప్లాన్ పక్కాగా అమలు:

ఒకరోజు రాత్రి ఎవరూ లేని సమయం చూసి మిల్లు ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించిన నిందితుడు, వస్త్రాల గోడౌన్‌కు ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టాడు. మిల్లులో అంతా వస్త్రాలు, సులభంగా మంటలు అంటుకునే రసాయనాలు ఉండటంతో క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ.. అప్పటికే రూ.24 కోట్ల విలువైన రెడీమేడ్ వస్త్రాలు, కడిగిన రోల్స్, ఆధునిక యంత్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

సీసీటీవీ ఆధారంగా నిందితుడి అరెస్ట్:

ప్రమాదం తీవ్రతను చూసి తొలుత ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని భావించారు. అయితే మిల్లు మేనేజ్‌మెంట్ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మిల్లు ప్రాంగణంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, మాజీ ఉద్యోగి రాత్రి వేళ అనుమానాస్పదంగా మిల్లులోకి వెళ్లి వస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ ఆధారాలతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, రూ.10,000 జీతం ఇవ్వనందుకే పగబట్టి నిప్పు పెట్టినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

వీడియో ఇక్కడ చూడండి..

యజమాని, ఉద్యోగి మధ్య చిన్నపాటి ఆర్థిక వివాదం కొలిక్కి రాకపోవడం వల్ల రూ.24 కోట్ల భారీ ఆస్తి నష్టం జరగడమే కాకుండా, మిల్లు మూతపడి మిగతా కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
బంపరాఫర్.. రూ.11కే సల్మాన్ కొత్త సినిమా టికెట్.. పూర్తి వివరాలివే
బంపరాఫర్.. రూ.11కే సల్మాన్ కొత్త సినిమా టికెట్.. పూర్తి వివరాలివే
కాళీమాతను అమావాస్య రోజే ఎందుకు పూజిస్తారు? అర్ధరాత్రి ఆరాధన..
కాళీమాతను అమావాస్య రోజే ఎందుకు పూజిస్తారు? అర్ధరాత్రి ఆరాధన..
క్యాన్సర్ కణితి కాదు.. పంటి ముక్క! అరుదైన కేసులో షాకింగ్ ట్విస్ట్
క్యాన్సర్ కణితి కాదు.. పంటి ముక్క! అరుదైన కేసులో షాకింగ్ ట్విస్ట్
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. కొత్త పోర్టల్..
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. కొత్త పోర్టల్..
అప్పుడే OTTలో శ్రీదేవి కొత్త సినిమా.. జెన్‌జీకి తెగ నచ్చేసిన మూవీ
అప్పుడే OTTలో శ్రీదేవి కొత్త సినిమా.. జెన్‌జీకి తెగ నచ్చేసిన మూవీ
బొత్స కుటుంబానికి మిశ్రమ ఫలితాలు..!
బొత్స కుటుంబానికి మిశ్రమ ఫలితాలు..!
రూరలైనా.. అర్బనైనా.. వార్ మాత్రం వన్‌సైడేనా..
రూరలైనా.. అర్బనైనా.. వార్ మాత్రం వన్‌సైడేనా..
మీ పిల్లలు తెలివైన వారో కాదో ఎలా తెలుసుకోవాలో తెలుసా?
మీ పిల్లలు తెలివైన వారో కాదో ఎలా తెలుసుకోవాలో తెలుసా?
దీపావళి రోజున కేదారేశ్వర వ్రతం ఇలా చేస్తే శుభప్రదం.. సౌభాగ్యం..
దీపావళి రోజున కేదారేశ్వర వ్రతం ఇలా చేస్తే శుభప్రదం.. సౌభాగ్యం..
వాస్తు టిప్స్ : దీపావళికి అస్సలే ఇవ్వకూడని బహుమతులు ఇవే!
వాస్తు టిప్స్ : దీపావళికి అస్సలే ఇవ్వకూడని బహుమతులు ఇవే!