AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మా నేను బాగున్నాను, భయపడకు..తల్లి కడుపులో నుంచే థంబ్స్ అప్ చూపించిన పాప! కట్‌చేస్తే..

గర్భంలో ఉన్న పాప మెదడులో నీరు చేరడంతో తీవ్రమైన సమస్యలు ఉన్నాయని, బిడ్డ బతకడం కష్టమని వైద్యులు అబార్షన్ చేయించుకోవాలని క్లోయ్ రూకర్ అనే తల్లికి సలహా ఇచ్చారు. అయితే, ఒక స్కానింగ్ సమయంలో ఆ పాప గర్భంలో నుంచే తన పిడికిలిని బిగించి థంబ్స్ అప్ చూపిస్తూ తల్లికి ధైర్యం చెప్పింది. ఆ తర్వాత జరిగిన వైద్య అద్భుతంతో డాక్టర్లు సైతం ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఈ ఘటనలో సైన్స్ ఓడిపోయి, ఒక తల్లి నమ్మకం గెలిచింది. ప్రస్తుతం ఆ పాప డేజీ ఆరోగ్యంగా పెరుగోతోంది. అసలు ఏం జరిగిందంటే..

అమ్మా నేను బాగున్నాను, భయపడకు..తల్లి కడుపులో నుంచే థంబ్స్ అప్ చూపించిన పాప! కట్‌చేస్తే..
Daisy Baby Miracle
Jyothi Gadda
|

Updated on: Sep 27, 2026 | 8:01 AM

Share

గర్భంలో పెరుగుతున్న బిడ్డ క్షేమంగా లేదని, జన్మించినా తీవ్రమైన నొప్పితో జీవించాల్సి వస్తుందని డాక్టర్లు చెప్పినప్పుడు ఏ తల్లి అయినా కుప్పకూలిపోతుంది. 27 ఏళ్ల క్లోయ్ రూకర్ పరిస్థితి కూడా అంతే. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు వైద్యులు ఇచ్చిన హెచ్చరిక ఆమెను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. కానీ, గర్భంలో ఉన్న ఆ నవమాసాల ప్రాణం చూపిన ఒక చిన్న సంకేతం సమస్త వైద్య విజ్ఞానాన్నే సవాలు చేసింది.

అబార్షన్ చేయించుకోవాలన్న వైద్యులు:

2022లో క్లోయ్ గర్భవతి అయినప్పుడు కుటుంబంలో ఎంతో సంతోషం వెల్లివిరిసింది. ఆమె తన కడుపులో ఎదుగుతున్న పాపకు డేజీ అని పేరు కూడా పెట్టుకుంది. కానీ, 20వ వారంలో తీసిన అనామలీ స్కాన్ వారి ఆశలపై నీళ్లు చల్లింది. పాప మెదడులో అసాధారణంగా నీరు చేరుతోందని, కిడ్నీలో కూడా సమస్యలు ఉన్నాయని గుర్తించారు. బిడ్డ బతికే అవకాశాలు చాలా తక్కువని, అబార్షన్ చేయించుకోవడమే మంచిదని వైద్యులు సలహా ఇచ్చారు.

స్కాన్ స్క్రీన్‌పై వింత అద్భుతం:

పరీక్షల కోసం ప్రతి రెండు వారాలకు ఒకసారి ఆసుపత్రికి వెళ్లే క్లోయ్, ఒకరోజు కన్నీళ్లతో తన కడుపుపై చేయి వేసి డేజీ, నువ్వు బాగున్నావని డాక్టర్లకు చెప్పు అని వేడుకుంది. ఆశ్చర్యకరంగా, ఆ రోజు తీసిన అల్ట్రాసౌండ్ స్కాన్ మోనిటర్‌పై ఒక అద్భుతం కనిపించింది. కడుపులోని పాప తన చిన్నారి చేతి పిడికిలిని బిగించి, బొటనవేలు పైకెత్తి డాక్టర్లకు థంబ్స్ అప్ సంకేతాన్ని ఇచ్చింది. అమ్మా నేను బాగున్నాను, భయపడకు అని చెప్పినట్లున్న ఆ దృశ్యం చూసి డాక్టర్లు ఆశ్చర్యపోగా, తల్లి కళ్లలో ఆనందబాష్పాలు రాలాయి.

ఇవి కూడా చదవండి

సైన్స్ ఓడింది.. మాతృత్వం గెలిచింది:

పాప జన్మించగానే అత్యవసర చికిత్స అందించడానికి వైద్య బృందం సిద్ధంగా ఉంది. అయితే, డేజీ పుట్టిన వెంటనే ఆమె మెదడుకు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయగా డాక్టర్లు నోరెళ్లబెట్టారు. గర్భంలో ఉన్నప్పుడు మెదడులో కనిపించిన నీరు పూర్తిగా మాయమైపోయింది. ఎలాంటి సర్జరీ లేదా వైద్యం లేకుండానే ఆ సమస్య తనకు తానే నయమైపోయింది. వైద్యులు ఆశ్చర్యపోతూ మేము సరైన బిడ్డకే స్కాన్ చేశామా? అని క్లోయ్‌ని అడిగారు.

ఇతరులకు ఆదర్శంగా క్లోయ్:

ప్రస్తుతం డేజీకి మూడేళ్లు. ఆమె ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా పెరుగుతోంది. ఈ కష్ట సమయం నుండి బయటపడిన క్లోయ్, ప్రస్తుతం గర్భధారణ సమయంలో మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న ఇతర తల్లులకు సహాయం చేయడానికి ఒక సోషల్ మీడియా వేదికను ఏర్పాటు చేసింది. వైద్యులు ఆశలు వదిలేసినా, నమ్మకంతో ముందుకు సాగి విజయం సాధించిన ఈ కథనం నిజంగా ఒక వైద్య అద్భుతమే.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?