AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి పడుకునే అరగంట ముందు ఈ నీళ్లు తాగితే.. ఒత్తిడి లేని గాఢనిద్ర మీ సొంతం!

దానిమ్మ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనందరికీ తెలుసు. అందులోని ఎర్రటి గింజలు పోషకాల గని. అయితే చాలామందికి తెలియని విషయమేమిటంటే.. దానిమ్మ పండ్లతో పాటు దానిమ్మ ఆకులు కూడా అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఆధునిక జీవనశైలిలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి. ఈ సమస్యకు దానిమ్మ ఆకుల కషాయం మంచి సహజ పరిష్కారంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

రాత్రి పడుకునే అరగంట ముందు ఈ నీళ్లు తాగితే.. ఒత్తిడి లేని గాఢనిద్ర మీ సొంతం!
Pomegranate Leaf Water
Jyothi Gadda
|

Updated on: Sep 27, 2026 | 7:20 AM

Share

దానిమ్మ పండ్లే కాకుండా దానిమ్మ ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ ఆకులతో తయారు చేసిన కషాయాన్ని రాత్రి పడుకోవడానికి అర్ధగంట ముందు తాగితే ఒత్తిడి తగ్గి, హాయిగా గాఢనిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఇది అద్భుతమైన సహజ నివారణ. ఈ ఆకుల నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు తగ్గడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తయారీ విధానం, పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

దానిమ్మ ఆకుల కషాయం తయారీ విధానం:

ఒక పాత్రలో ఒక గ్లాసు నీటిని తీసుకొని, అందులో కొన్ని శుభ్రం చేసిన దానిమ్మ ఆకులను వేయాలి. ఈ నీటిని బాగా మరిగించి, ఆ తర్వాత వడకట్టుకోవాలి. ఈ కషాయాన్ని రాత్రి పడుకోవడానికి దాదాపు అర్ధగంట ముందు తాగితే మనస్సు, శరీరం ప్రశాంతంగా మారతాయి. ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా త్వరగా గాఢనిద్ర పడుతుంది.

ఇవి కూడా చదవండి

ఆరోగ్య ప్రయోజనాలు:

నిద్రలేమికి చెక్: రాత్రి వేళల్లో నిద్రపట్టక ఇబ్బందిపడేవారు ఈ కషాయాన్ని తాగడం వల్ల నరాల ఒత్తిడి తగ్గి హాయిగా నిద్రపోవచ్చు.

జలుబు, దగ్గు నుండి ఉపశమనం: దానిమ్మ ఆకులు, బెరడును మరిగించిన నీటిని ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల జలుబు, తగ్గని పొడి దగ్గు త్వరగా తగ్గుతాయి.

కొలెస్ట్రాల్, బరువు నియంత్రణ: ఈ కషాయం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా అధిక బరువు సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.

జీర్ణ వ్యవస్థ మెరుగుదల: తరచుగా వేధించే గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్యలను నివారించడంలో దానిమ్మ ఆకులు సమర్థవంతంగా పనిచేస్తాయి.

రోగనిరోధక శక్తి, చర్మ సౌందర్యం: ఇందులోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతాయి. అంతేకాక నోటి పూత, చిగుళ్ల సమస్యలు, చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న దానిమ్మ ఆకుల కషాయాన్ని మీ రోజువారీ ఆహార అలవాట్లలో భాగం చేసుకోవడం వల్ల నిద్రలేమికి దూరంగా ఉండవచ్చు.

(గమనిక: ఈ సమాచారం సాధారణ ఆరోగ్య ప్రయోజనాల కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా ఈ చిట్కాలు పాటించేముందు సంబంధిత వైద్య నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.)

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?