AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3 ఏళ్ల కూతురిని పక్కన కూర్చోబెట్టుకుని ఆటో నడుపుతున్న తల్లి.. లక్ష్యం ఏంటో తెలుసా?

అమ్మ ప్రేమకు సరిహద్దులు ఉండవు అనే మాటకు ప్రత్యక్ష నిదర్శనం ముంబైకి చెందిన కోమల్ గైక్వాడ్. ముంబై వీధుల్లో సందడి చేసే వేలాది ఆటోల్లో కోమల్ నడిపే ఆటో చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆ ఆటో నడుపుతున్నది ఒక మహిళ కాగా, డ్రైవర్ సీటు పక్కనే ఆమె 3 ఏళ్ల చిన్నారి కూతురు కూర్చుని ఉంటుంది. నిరంతరం కష్టపడుతూ, బిడ్డ భవిష్యత్తు కోసం ఆమె చేస్తున్న పోరాటం నెటిజన్ల హృదయాలను కలచివేస్తోంది.

3 ఏళ్ల కూతురిని పక్కన కూర్చోబెట్టుకుని ఆటో నడుపుతున్న తల్లి.. లక్ష్యం ఏంటో తెలుసా?
Mumbai Woman Auto Driver
Jyothi Gadda
|

Updated on: Sep 27, 2026 | 8:58 AM

Share

ముంబై వీధుల్లో ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తన 3 ఏళ్ల చిన్నారి కూతురిని పక్కన కూర్చోబెట్టుకుని ఆటో నడుపుతున్న కోమల్ గైక్వాడ్ అనే తల్లి కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోమల్ కూతురు తేజస్వికి కేవలం 18 నెలల వయసు ఉన్నప్పుడు ఆమె భర్త వారిని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. చిన్న బిడ్డతో ఒంటరిగా మిగిలిపోయిన కోమల్, జీవనోపాధి కోసం ఎన్నో ఉద్యోగాల కోసం ప్రయత్నించింది. అయితే, చిన్న పాపను వెంటబెట్టుకుని వస్తుండటంతో ఎవరూ ఆమెకు పని ఇవ్వడానికి ముందుకు రాలేదు. దాంతో బిడ్డను తన వద్దే ఉంచుకుని స్వతంత్రంగా సంపాదించేందుకు ఆటో డ్రైవర్‌గా మారాలని నిర్ణయించుకుంది.

ఉదయం 6 నుండి రాత్రి 11 వరకు రోడ్లపైనే:

కోమల్ ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే తన చిన్నారిని ఆటో సీటు పక్కన కూర్చోబెట్టుకుని రోడ్లపైకి వస్తుంది. మధ్యాహ్నం ఇంటి పనుల కోసం కాసేపు విరామం తీసుకుని, మళ్లీ రాత్రి 11 గంటల వరకు ఆటో నడుపుతూనే ఉంటుంది. ఆటో రోడ్లపై తిరుగుతున్నంత సేపు ఆ చిన్నారి తల్లి పక్కనే కూర్చుంటుంది. అలసటగా అనిపించినప్పుడు ఆటో వెనుక సీటులోనే నిద్రపోతుంది.

ఇవి కూడా చదవండి

కూతురిని IPS చేయడమే లక్ష్యం:

ఇంటి అద్దె, కరెంట్ బిల్లులు, ఇతర ఖర్చులన్నీ కోమల్ ఒక్కత్తే భరిస్తోంది. నా బిడ్డను భవిష్యత్తులో ఐపీఎస్ (IPS) అధికారిణిగా చేయడమే నా జీవిత లక్ష్యం. అలాగే మాకు మా సొంత ఇల్లు ఉండాలి.. అద్దె ఇళ్లు మారుతూ ఇబ్బంది పడకూడదు అని కోమల్ చెబుతోంది.

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పోస్ట్ చేసిన ఒక వీడియో ద్వారా కోమల్ కథ వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు కోటి పైగా వ్యూస్, లక్షలాది లైక్స్ వచ్చాయి. భర్త లేకపోయినా, సమాజంలో ఎలాంటి మద్దతు లేకపోయినా ఒంటరిగా పోరాడుతూ బిడ్డను గొప్పగా పెంచాలనుకుంటున్న కోమల్ గైక్వాడ్ కథ ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకం. కల్యాణ్‌కి చెందిన కోమల్ గైక్వాడ్ తన 3 ఏళ్ల కుమార్తెతో కలిసి ఆటో నడుపుతూ సాగిస్తున్న పోరాటం తెలిసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?