AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండగలకు పనిచేయలేక అలిసిపోతున్నారా? రాగి, ఇత్తడి పూజా సామాగ్రిని ఇలా క్లీన్‌ చేశారంటే తళతళలే..!

మన ఇళ్లలో పూజల కోసం, తాగునీటి కోసం, వంటల కోసం రాగి, ఇత్తడి పాత్రలను విస్తృతంగా ఉపయోగిస్తాం. అయితే గాలిలోని తేమ, ఆక్సిజన్ ప్రభావం వల్ల కొద్దిరోజులకే ఈ పాత్రలు నల్లగా మారి తమ సహజమైన మెరుపును కోల్పోతాయి. కెమికల్స్ ఉండే క్లీనర్లను వాడకుండా, మన వంటగదిలో లభించే సహజ సిద్ధమైన పదార్థాలతోనే ఈ పాత్రలను మళ్లీ కొత్తవాటిలా మెరిపించవచ్చు. ఆ సులభమైన చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.

పండగలకు పనిచేయలేక అలిసిపోతున్నారా? రాగి, ఇత్తడి పూజా సామాగ్రిని ఇలా క్లీన్‌ చేశారంటే తళతళలే..!
Home Cleaning Tips
Jyothi Gadda
|

Updated on: Aug 14, 2026 | 6:20 PM

Share

పూజలకు, రోజువారీ అవసరాలకు వాడే రాగి, ఇత్తడి పాత్రలు కొంతకాలానికి గాలిలోని తేమ వల్ల నల్లబడి మెరుపును కోల్పోతాయి. రసాయనాలు వాడకుండా ఇంట్లోని సహజ పదార్థాలతో వీటిని సులభంగా శుభ్రం చేయవచ్చు. నిమ్మకాయ-ఉప్పు మిశ్రమం, చింతపండు గుజ్జు లేదా వెనిగర్-బేకింగ్ సోడాలను ఉపయోగించి తోమడం వల్ల నిమిషాల్లో మురికి వదిలి పాత్రలు కొత్తవాటిలా మెరుస్తాయి. ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం..

నిమ్మకాయ, ఉప్పు: రాగి, ఇత్తడి పాత్రల నలుపును వదిలించడానికి ఇది అత్యంత వేగవంతమైన, ప్రభావవంతమైన పద్ధతి. సగం కోసిన నిమ్మకాయపై కొద్దిగా రాతి ఉప్పు లేదా నార్మల్ ఉప్పు చల్లాలి. దాంతో పాత్రలపై బాగా రుద్దాలి. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్, ఉప్పు కలయిక నలుపును తక్షణమే వదిలిస్తుంది. అనంతరం గోరువెచ్చని నీటితో కడిగితే పాత్రలు తళతళా మెరుస్తాయి. ఇప్పుడు తడి లేకుండా కాటన్‌ క్లాత్‌తో తుడుచుకుని వాడుకుంటే సరిపోతుంది.

చింతపండు రసం: మన సాంప్రదాయ వంటగదిలో చింతపండుతో పాత్రలు శుభ్రం చేయడం పూర్వం నుంచీ వస్తున్న పద్ధతి. ఇందుకోసం కొద్దిగా చింతపండును నీళ్లలో నానబెట్టి గుజ్జులా చేయాలి. ఈ గుజ్జును రాగి లేదా ఇత్తడి పాత్రలకు పట్టించి 5 నుండి 10 నిమిషాలు ఉంచాలి. తర్వాత స్క్రబ్బర్‌తో రుద్ది, నీళ్లతో కడిగితే మొండి కార మరకలు కూడా సులభంగా పోతాయి.

ఇవి కూడా చదవండి

వెనిగర్, బేకింగ్ సోడా: ఒక గిన్నెలో ఒక స్పూన్ బేకింగ్ సోడా, సరిపడా తెల్ల వెనిగర్ కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను పాత్రలపై రాసి కొన్ని నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత మెత్తటి పీచుతో తోమి నీటితో శుభ్రం చేస్తే పాత్రలు భలే మెరుస్తాయి.

టొమాటో సాస్ / కేచప్: వినడానికి వింతగా అనిపించినా, టొమాటో సాస్‌లోని యాసిడ్ గుణాలు రాగి పాత్రలను మెరిపించడంలో బాగా పనిచేస్తాయి. పాత్రలపై సాస్ రాసి 10 నిమిషాల తర్వాత తోమి కడిగితే మంచి ఫలితం ఉంటుంది.

అయితే, ఇక్కడ కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా పాటించాలి. పాత్రలను కడిగిన వెంటనే నీటి చుక్కలు లేకుండా పొడి గుడ్డతో తడి తుడవాలి. నీటి చుక్కలు అలాగే ఉంటే మళ్లీ నల్లటి మరకలు పడే అవకాశం ఉంది. అలాగే, పాత్రలను తోమేటప్పుడు కఠినమైన వైర్ స్క్రబ్బర్ల కంటే మెత్తటి పీచు లేదా గుడ్డను ఉపయోగించడం వల్ల గీతలు పడకుండా ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో ఎలాంటి శ్రమ లేకుండా, తక్కువ ఖర్చుతోనే రాగి, ఇత్తడి పాత్రలను ఎల్లప్పుడూ అందంగా, శుభ్రంగా ఉంచుకోవచ్చు!

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రాగి, ఇత్తడి పూజా సామాగ్రిని ఇలా క్లీన్‌ చేశారంటే తళతళలే..!
రాగి, ఇత్తడి పూజా సామాగ్రిని ఇలా క్లీన్‌ చేశారంటే తళతళలే..!
కింగ్ నాగార్జునకు సైబర్ కేటుగాళ్ల షాక్.. అసలు ఏం జరిగిందో చెప్పిన
కింగ్ నాగార్జునకు సైబర్ కేటుగాళ్ల షాక్.. అసలు ఏం జరిగిందో చెప్పిన
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ఇంత ఫిట్‌గా ఎలా ఉంటారు? సీఎం ఆరోగ
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ఇంత ఫిట్‌గా ఎలా ఉంటారు? సీఎం ఆరోగ
పరిచయం నుంచి నిశ్చితార్థం వరకు.. కట్‌చేస్తే, పోలీసుల రంగప్రవేశం
పరిచయం నుంచి నిశ్చితార్థం వరకు.. కట్‌చేస్తే, పోలీసుల రంగప్రవేశం
కోసిన బంగాళదుంపలు నల్లబడుతున్నాయా? తాజాగా ఉండాలంటే ఇలా చేయండి..!
కోసిన బంగాళదుంపలు నల్లబడుతున్నాయా? తాజాగా ఉండాలంటే ఇలా చేయండి..!
లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకీ మామ..లుక్ అద్దిరిపోయింది
లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకీ మామ..లుక్ అద్దిరిపోయింది
అప్పుల బాధలో పుట్టిన అద్భుతం.. సేఫ్టీ పిన్ కథ మామూలుగా లేదుగా..
అప్పుల బాధలో పుట్టిన అద్భుతం.. సేఫ్టీ పిన్ కథ మామూలుగా లేదుగా..
పాత బావిలో విషవాయువు.. నలుగురు మృతి
పాత బావిలో విషవాయువు.. నలుగురు మృతి
ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్‌ క్రేట్‌
ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్‌ క్రేట్‌
బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందా..! 2030 నాటికి బంగారం ధర..
బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందా..! 2030 నాటికి బంగారం ధర..