AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పిల్లల బాల్ ఆధార్ ఫ్రీ అప్‌డేట్ గడువు.. ఈ పనులు వెంటనే పూర్తి చేయండి!

దేశంలో ప్రతీ పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో, ఐదేళ్ల లోపు చిన్నారులకు ఇచ్చే బాల్ ఆధార్ కూడా అంతే ముఖ్యం. పాఠశాల ప్రవేశాల నుంచి ప్రభుత్వ పథకాల వరకు చిన్నారులకు ఇది ప్రాథమిక గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది. అయితే, బాల్ ఆధార్ కలిగిన పిల్లల వివరాలను, డాక్యుమెంట్లను ఉచితంగా నవీకరించుకునే ప్రక్రియపై యుఐడిఎఐ ముఖ్యమైన సమాచారాన్ని అందించింది.

మీ పిల్లల బాల్ ఆధార్ ఫ్రీ అప్‌డేట్ గడువు.. ఈ పనులు వెంటనే పూర్తి చేయండి!
Baal Aadhaar Free Update
Jyothi Gadda
|

Updated on: Sep 27, 2026 | 1:05 PM

Share

దేశంలో ప్రతీ పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో, ఐదేళ్ల లోపు చిన్నారులకు ఇచ్చే బాల్ ఆధార్ కూడా అంతే ముఖ్యం. పాఠశాల ప్రవేశాల నుంచి ప్రభుత్వ పథకాల వరకు చిన్నారులకు ఇది ప్రాథమిక గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది. అయితే, బాల్ ఆధార్ కలిగిన పిల్లల వివరాలను, డాక్యుమెంట్లను ఉచితంగా నవీకరించుకునే ప్రక్రియపై యుఐడిఎఐ ముఖ్యమైన సమాచారాన్ని అందించింది.

బాల్ ఆధార్ అంటే ఏమిటి?

5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు నీలిరంగులో బాల్ ఆధార్ కార్డును జారీ చేస్తారు. ఈ వయసులో పిల్లల వేలిముద్రలు, కంటిపాప గుర్తులు పూర్తిగా అభివృద్ధి చెందవు కాబట్టి, బాల్ ఆధార్‌లో ఎలాంటి బయోమెట్రిక్ సమాచారం సేకరించరు. ఇది కేవలం తల్లిదండ్రుల ఆధార్ నంబర్ మరియు పిల్లల జనన ధృవీకరణ పత్రం ఆధారంగా జారీ అవుతుంది.

బయోమెట్రిక్ అప్‌డేట్ ఎప్పుడు తప్పనిసరి?

5 సంవత్సరాలు నిండిన తర్వాత: పాప లేదా బాబుకు 5 సంవత్సరాల వయస్సు రాగానే, వారి వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, ఫోటోను ఆధార్ కేంద్రానికి వెళ్లి తప్పనిసరిగా నమోదు చేయించాలి. దీనిని మొదటి బయోమెట్రిక్ అప్‌డేట్ అంటారు. అలాగే పిల్లలకు 15 ఏళ్లు నిండినప్పుడు రెండవసారి బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఉచిత అప్‌డేట్ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలి?

చిన్నారుల చిరునామా లేదా ఇతర వివరాల సవరణకు ‘myAadhaar’ పోర్టల్ ద్వారా ఉచితంగా గుర్తింపు, చిరునామా ఆధార పత్రాలను అప్‌లోడ్ చేయవచ్చు. బయోమెట్రిక్ వివరాల నమోదు కోసం సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి పిల్లలను స్వయంగా తీసుకెళ్లాలి. ఐదేళ్లు, పదిహేనేళ్లు నిండిన పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్‌కు యుఐడిఎఐ ఎలాంటి రుసుము వసూలు చేయదు. పిల్లల ఆధార్ కార్డులు నిలిచిపోకుండా ఉండటానికి, పాఠశాల ప్రవేశాలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి తల్లిదండ్రులు వెంటనే తమ పిల్లల బాల్ ఆధార్ వివరాలను సరిచూసుకుని, అవసరమైన అప్‌డేట్‌లను పూర్తి చేయడం శ్రేయస్కరం.

Follow Us