AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రికి రాత్రే డబుల్ చిన్ మాయం చేసే పరిష్కారం కావాలా..? సోషల్ మీడియా ట్రిక్స్ వెనుక అసలు వాస్తవం ఇదే!

నేటి డిజిటల్ యుగంలో అందమైన, షార్ప్ జా-లైన్ ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే, చాలామందిని వేధించే ప్రధాన సమస్యలలో డబుల్ చిన్ ఒకటి. గడ్డం కింద కొవ్వు పేరుకుపోవడం లేదా చర్మం సాగిపోవడం వల్ల ఇది ఏర్పడుతుంది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే డబుల్ చిన్ కరిగించేయండి అంటూ అనేక క్రీములు, ఫేస్ మాస్క్‌లు, మసాజ్ ట్రిక్స్ దర్శనమిస్తుంటాయి. కానీ ఇది నిజంగా సాధ్యమేనా? అసలు నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

రాత్రికి రాత్రే డబుల్ చిన్ మాయం చేసే పరిష్కారం కావాలా..? సోషల్ మీడియా ట్రిక్స్ వెనుక అసలు వాస్తవం ఇదే!
Double Chin Removal
Jyothi Gadda
|

Updated on: Aug 14, 2026 | 7:08 PM

Share

ముఖం కింద, గడ్డం ప్రాంతంలో అదనపు కొవ్వు పేరుకుపోయినప్పుడు, ముఖం మందంగా కనిపిస్తుంది. అది బరువుగా కూడా అనిపిస్తుంది. గడ్డం మీద అదనపు కొవ్వు పేరుకుపోయినప్పుడు, దానిని డబుల్ చిన్ అంటారు. చాలా మందికి ఈ పరిస్థితి చికాకుగా అనిపిస్తుంది. బరువు పెరగడం దీనికి ఒక కారణం అయినప్పటికీ, డబుల్ చిన్ ఉన్నంత మాత్రాన మీరు అధిక బరువుతో ఉన్నారని అర్థం కాదు. ఇది జన్యుపరమైన కారణాలు, వృద్ధాప్యం, చర్మం సాగే గుణం కోల్పోవడం, ముఖం సహజ భంగిమ కారణంగా కూడా ఏర్పడవచ్చు. ఈ రోజుల్లో డబుల్ చిన్‌ను రాత్రికి రాత్రే తగ్గిస్తాయని చెప్పుకునే అనేక నివారణలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. వాటిని నమ్మకండి. అలాంటి ట్రిక్స్‌ వెనుక ఉన్న అసలు వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం.

రాత్రికి రాత్రే మాయమవ్వడం సాధ్యమేనా?

చర్మ సంరక్షణ, సౌందర్య నిపుణుల ప్రకారం.. డబుల్ చిన్ రాత్రికి రాత్రే మాయమవ్వడం శాస్త్రీయంగా అసాధ్యం. గడ్డం కింద పేరుకుపోయేది కొవ్వు. ఏ క్రీమ్ లేదా హోమ్ రెమెడీ కూడా ఒక్క రోజులో ఆ కొవ్వును కరిగించలేదు. సోషల్ మీడియాలో కనిపించే కొన్ని చిట్కాలు లేదా షీట్ మాస్క్‌లు వాడినప్పుడు ముఖం వెంటనే సన్నగా అనిపించడానికి కారణం ఇవే:

మసాజ్ చేయడం వల్ల ముఖంలో రక్తాభిసరణ పెరిగి, చర్మం కింద నిలిచిన నీరు కదులుతుంది. అలాగే, కొన్ని క్రీములు చర్మాన్ని కొద్దిసేపు టైట్‌గా ఉంచుతాయి. కానీ, ఇది కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉండే తాత్కాలిక ప్రభావం.

ఇవి కూడా చదవండి

డబుల్ చిన్ తగ్గడానికి సరైన మార్గాలు:

డబుల్ చిన్ నుండి శాశ్వత ఉపశమనం పొందడానికి ఓర్పు, క్రమశిక్షణ అవసరం. డబుల్ చిన్‌కు ప్రధాన కారణం శరీరంలో కొవ్వు పెరగడం. సమతుల్య ఆహారం తీసుకుంటూ, రోజువారీ వ్యాయామం ద్వారా బరువు తగ్గితే డబుల్ చిన్ దానంతట అదే తగ్గుతుంది. గడ్డం, మెడ కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు ప్రతిరోజూ చేయడం వల్ల ఫలితం ఉంటుంది. ఉదాహరణకు.. నెట్ స్ట్రెచింగ్, చిన్ లిఫ్ట్ వంటివి అలవాటుగా చేసుకోవాలి.

నిరంతరం ఫోన్లు చూస్తూ తల దించి కూర్చోవడం వల్ల కూడా మెడ వద్ద చర్మం సాగిపోతుంది. కూర్చునేటప్పుడు వెన్నుముక, మెడ నిటారుగా ఉంచాలి. ఇలాంటి సహజ పద్ధతుల్లో తగ్గని తీవ్రమైన డబుల్ చిన్ సమస్య ఉన్నవారికి డెర్మటాలజిస్టులు కైబెల్లా ఇంజెక్షన్లు, కూల్‌స్కల్ప్టింగ్ లేదా లైపోసక్షన్ వంటి కాస్మెటిక్ ప్రక్రియలను సూచిస్తారు. ఏదైనా మార్పు రావడానికి సమయం పడుతుంది. రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయనే అపోహలను నమ్మి ఆరోగ్యాన్ని, చర్మాన్ని పాడుచేసుకోకుండా సరైన జీవనశైలిని పాటించడం శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us