AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాంటి పచ్చి ఖర్జూరాలు కనిపిస్తే వెంటనే తెచ్చుకు తినేయండి..ఈ అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం!

వర్షాకాలం రాగానే వాతావరణం ఆహ్లాదకరంగా మారినప్పటికీ, రకరకాల ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు చుట్టుముడతాయి. అందుకే ఈ సీజన్‌లో తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వర్షాకాలంలో మార్కెట్‌లో ఎక్కువగా లభించే పండ్లు, ఎండిన ఖర్జూరాల కంటే పచ్చి ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో పచ్చి ఖర్జూరాలు ఎందుకు తినాలి, వాటి ప్రయోజనాలేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Aug 14, 2026 | 8:42 PM

Share
నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నలాజికల్ ఇన్ఫర్మేషన్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, పచ్చి ఖర్జూరాలలో కెరోటినాయిడ్లు, ఫినాలిక్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలంలో వివిధ రకాల అలెర్జీలు పెరుగుతాయి. చర్మం కూడా దురద, ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలతో బాధపడుతుంది. ఈ సమస్యలన్నింటినీ తగ్గించడంలో పచ్చి ఖర్జూరాలను తినడం సహాయపడుతుంది.

1 / 6
రోగనిరోధక శక్తి పెంపు:  వర్షాకాలంలో వాతావరణ మార్పుల వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. పచ్చి ఖర్జూరాలలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వర్షాకాలంలో వ్యాపించే రకరకాల వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

2 / 6
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: వర్షాకాలంలో చాలామందిని వేధించే ప్రధాన సమస్య మందగించిన జీర్ణక్రియ. పచ్చి ఖర్జూరాలలో కరిగే, కరగని ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి, మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

3 / 6
తక్షణ శక్తిని అందిస్తాయి: వర్షాకాలంలో తేమ ఎక్కువ ఉండటం వల్ల సులభంగా అలసట, నీరసం ఆవహిస్తాయి. పచ్చి ఖర్జూరాలలో సహజ సిద్ధమైన గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ ఉత్సాహాన్ని, శక్తిని అందిస్తాయి.  పచ్చి ఖర్జూరాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మేలు చేస్తాయి. ఎందుకంటే వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటమే కాకుండా, అవి పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్లకు కూడా మంచి మూలం.

4 / 6
రక్తహీనత నివారణ: మహిళలు, పిల్లలలో సర్వసాధారణంగా కనిపించే అనీమియా సమస్యకు పచ్చి ఖర్జూరాలు మంచి పరిష్కారం. వీటిలో లభించే సమృద్ధియైన ఐరన్ శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచి, హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.

5 / 6
గుండె, ఎముకల ఆరోగ్యం: వీటిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, కాల్సియం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచడంతో పాటు ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. వర్షాకాలంలో లభించే ఈ సహజసిద్ధమైన పచ్చి ఖర్జూరాలను ప్రతిరోజూ 3 నుండి 4 తినడం వల్ల ఈ సీజనల్ వ్యాధుల నుండి దూరంగా ఉంటూ, రోజంతా శక్తివంతంగా ఉండవచ్చు!

6 / 6
Follow Us