AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలు చివరి బోగీ వెనుక X గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? దాని వెనుక ఉన్న అసలు రహస్యమిదే!

మనం నిత్యం ప్రయాణించే భారతీయ రైళ్లలో ఎన్నో రకాల కోడ్‌లు, సింబల్స్, రంగులు కనిపిస్తుంటాయి. అయితే, ప్రయాణికులు ఎక్కువగా గమనించే గుర్తులలలో రైలు చివరి బోగీ వెనుక భాగంలో పసుపు లేదా తెల్లటి రంగులో బోల్డ్‌గా రాసి ఉండే X గుర్తు ఒకటి. చాలామంది దీనిని కేవలం ఒక అక్షరంగా లేదా డిజైన్‌గా భావిస్తుంటారు. కానీ, ఇండియన్ రైల్వేస్ భద్రతా వ్యవస్థలో ఈ చిన్న చిహ్నానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.

రైలు చివరి బోగీ వెనుక X గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? దాని వెనుక ఉన్న అసలు రహస్యమిదే!
Why Trains Have X Mark
Jyothi Gadda
|

Updated on: Aug 14, 2026 | 9:25 PM

Share

భారతీయ రైళ్ల చివరి బోగీ వెనుక భాగంలో పెద్దగా X గుర్తు ముద్రించి ఉండటాన్ని మనం చూస్తుంటాం. ఇది కేవలం ఒక అక్షరం లేదా డిజైన్ మాత్రమే కాదు, రైల్వే భద్రతలో అత్యంత కీలకమైన సంకేతం. రైలు ప్రయాణంలో ఇంజిన్‌తో పాటు అన్ని బోగీలు సరిగ్గా కనెక్ట్ అయి ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ గుర్తును ఉపయోగిస్తారు. రైలు ఒక స్టేషన్‌ను లేదా సిగ్నల్ పాయింట్‌ను దాటి వెళ్తున్నప్పుడు, చివరి కోచ్‌పై ఉన్న X గుర్తును అక్కడ విధులు నిర్వర్తించే స్టేషన్ మాస్టర్ లేదా రైల్వే సిబ్బంది తప్పనిసరిగా గమనిస్తారు. ఈ గుర్తు కనిపిస్తే, రైలులోని అన్ని బోగీలు ఎక్కడా విడిపోకుండా సురక్షితంగా వచ్చాయని వారు నిర్ధారించుకుంటారు.

ఒకవేళ అసాధారణ పరిస్థితుల వల్ల మధ్యలో ఏదైనా బోగీ లింక్ తెగిపోయి వెనుక ఉండిపోతే, చివరి కోచ్‌పై X గుర్తు కనిపించదు. ఆ గుర్తు లేకపోవడాన్ని గమనించిన వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమై, సదరు రూట్‌లో ఇతర రైళ్ల రాకపోకలను నిలిపివేస్తారు. దీనివల్ల వెనుక నుంచి వచ్చే వేరే రైలు ఢీకొనే ప్రమాదం తప్పుతుంది.

LV బోర్డు, బ్లింకింగ్ లైట్:

కేవలం X గుర్తు మాత్రమే కాకుండా, చివరి బోగీ వెనుక మరికొన్ని భద్రతా సంకేతాలు కూడా ఉంటాయి. X గుర్తుతో పాటు చిన్న రౌండ్ లేదా చతురస్రాకార బోర్డుపై LV అని రాసి ఉంటుంది. LV అంటే లాస్ట్ వెహికల్ అని అర్థం. ఇది సదరు బోగీయే రైలుకు చివరిదని స్పష్టం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

రేడియం, ఫ్లాషింగ్ లైట్: రాత్రి వేళల్లో లేదా పొగమంచు ఎక్కువగా ఉన్న సమయంలో X గుర్తు సరిగ్గా కనిపించకపోవచ్చు. అందుకే దీనిని మెరిసే రేడియం పెయింట్‌తో రాస్తారు. దాంతో పాటు చివరి బోగీ కింద భాగంలో ఎరుపు రంగు లైట్ నిరంతరం బ్లింక్ అవుతూ ఉంటుంది. చూశారుగా.. ప్రతిరోజూ మనం చూసే ఈ X గుర్తు వెనుక ఎంతటి కీలకమైన భద్రతా యంత్రాంగం దాగి ఉందో! ప్రయాణికుల రక్షణ కోసం భారతీయ రైల్వేస్ అమలు చేస్తున్న అనేక నియమాల్లో ఇది అత్యంత కీలకమైనది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us