AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాలా మంది హీరోతో నటించా.. కానీ ఆ ఇద్దరితో చేయలేదు : ముమైత్ ఖాన్

అప్పట్లో హాట్ బ్యూటీగా ఇండస్ట్రీని ఊపేసింది ముద్దుగుమ్మ  ముమైత్ ఖాన్.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించింది ఈ వయ్యారి భామ. రీసెంట్ డేస్ లో ముమైత్ ఖాన్ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు.స్పెషల్ రోల్స్ లోనూ కనిపించడంలేదు.

Rajeev Rayala
|

Updated on: Aug 16, 2026 | 1:36 PM

Share
 అప్పట్లో హాట్ బ్యూటీగా ఇండస్ట్రీని ఊపేసింది ముద్దుగుమ్మ  ముమైత్ ఖాన్.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించింది ఈ వయ్యారి భామ. రీసెంట్ డేస్ లో ముమైత్ ఖాన్ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. స్పెషల్ రోల్స్ లోనూ స్పెషల్ సాంగ్స్ లోనూ ముమైత్ కనిపించడం లేదు.  ఆ మధ్య తెలుగు బిగ్ బాస్ షోలో సందడి చేసింది.

1 / 5
మొన్నామధ్య ఓ డ్యాన్స్ షోకు జడ్జ్ గా వ్యవహరించింది. తర్వాత బుల్లితెర నుంచి కూడా మాయం అయ్యింది. కాగా గతంలో ముమైత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో ముమైత్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓ స్టార్ హీరో గురించి ముమైత్ చేసిన కామెంట్స్. ముమైత్ ఖాన్ మాట్లాడుతూ.. నందమూరి బాలకృష్ణపై తనకు అపారమైన అభిమానం ఉందని, ఆయన ఎనర్జీ అద్భుతమని ముమైత్ ఖాన్ చెప్పుకొచ్చింది.

2 / 5
అలాగే పూరి జగన్నాథ్‌తో తన ప్రయాణం సి.కళ్యాణ్ సిఫార్సుతో ప్రారంభమైందని ముమైత్ ఖాన్ వెల్లడించారు. పూరితో చాలా సినిమాలు చేశా..  ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో తాను రోజూ టచ్‌లో లేనప్పటికీ, కలిసినప్పుడు స్నేహం అలాగే కొనసాగుతుందని ముమైత్ ఖాన్ అన్నారు. తన దృష్టిలో నిజమైన స్నేహం అంటే రోజూ మాట్లాడుకోవటం కాదని, ఎప్పుడు కలిసినా మునుపటి అనుబంధం అలాగే ఉండటమేనని ఆమె అన్నారు.

3 / 5
టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతో తాను కలిసి పనిచేశానని, మోహన్ బాబు, నాగార్జున వంటి కొందరు సీనియర్ నటులు మినహా మిగిలిన అందరితో తాను పనిచేశానని ముమైత్ ఖాన్ తెలిపారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో చేయలేదని ఆమె అన్నారు. ఆ ఇద్దరు హీరోలతో కూడా నటించే ఛాన్స్ వస్తుందేమో చూడాలి అని ముమైత్ తెలిపింది. 

4 / 5
అలాగే తాను సినిమా రంగంలోకి డబ్బు అవసరం కోసం రాలేదని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని ఆమె అన్నారు. ఇంట్లో ఆర్థిక కష్టాలను చిన్నతనం నుంచే గమనించి, స్కూల్‌కు నడిచి వెళ్లి రూపాయిన్నర ఆదా చేసి, ఆ డబ్బును తన తండ్రికి ఇచ్చేదానినని ముమైత్ ఖాన్ గుర్తుచేసుకున్నారు. తన తల్లిదండ్రులు ఎప్పుడూ పని చేయమని చెప్పనప్పటికీ, తానే కుటుంబానికి అండగా నిలిచానని ముమైత్ చెప్పుకొచ్చింది. 

5 / 5
Follow Us