AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eluru: వలకు చిక్కిన భారీ పండుగప్ప.. వేలంలో ఎంత ధరకు అమ్ముడైందో తెల్సా

కొందరు యువకులు స్థానికంగా ఉన్న గోదావరిలో చేపల వేటకు వెళ్తే.. వారికి ఓ బాహుబలి చేప చిక్కింది.. తీరా చూస్తే అది పండుగప్ప.. బరువులో గొప్ప.. ఇంతకీ వేలంలో ఎంతకు అమ్ముడైందో తెలుసా.. ధర చూస్తే దెబ్బకు షాక్ అవుతారు. ఓ సారి ఈ స్టోరీ చూసేయండి.

Eluru: వలకు చిక్కిన భారీ పండుగప్ప.. వేలంలో ఎంత ధరకు అమ్ముడైందో తెల్సా
Fish
B Ravi Kumar
| Edited By: |

Updated on: Mar 18, 2026 | 11:07 AM

Share

పండుగప్ప పేరు చెబితే చాలు గోదావరి వాళ్లకు నోరు ఊరుతుంది. ఎందుకంటే అది చేపలలో రారాజు. అయితే తాజాగా మత్సకారుడి వలకి భారీ పండుగప్ప చిక్కింది. 20 కిలోలు బరువున్న ఈ చేప మార్కెట్‌లో రూ 10 వేలు ధర పలికింది. చేపలలో పండు గొప్ప రుచే వేరు దీనిని తినేందుకు చేపల ప్రియులు ఎగబడతారు. అందులోనూ గోదావరిలో పెరిగిన పండు గొప్ప అంటే దాని రుచే వేరు. ఎంత ఖరీదు అయినా సరే దీనిని కొనేందుకు చేపల ప్రియులు వెనకాడరు. చేపల్లో పండుగప్ప జాతి చేపలు ప్రత్యేకం. గోదావరిలో అరుదుగా లభించే ఈ చేప అంటే భోజన ప్రియులు లొట్టలేస్తారు. ఎంతటి ధరైనా కొనడానికి వెనుకాడరు.

అలాంటిది 20 కేజీల భారీ పండుగప్ప దొరికితే అటు మత్సకారుడికి.. ఇటు కొనుక్కున్నవారికి పండుగే. యలమంచిలి వశిష్ఠ గోదావరి తీరంలో స్థానిక మత్సకార యువకులు చేపలను వేటాడుతుంటే.. వారికి భారీ పండుగప్ప చేప లభించింది. చేప భారీగా ఉండటంతో దానిని గట్టు మీదకు తీసుకురావడం ఒక్కరి వల్ల కాలేదు. పైకి ఎత్తలేనంత ఆకారంలో ఉన్న భారీ పండుగప్పను చూసేందుకు జనం పోటీపడ్డారు. అంతే కాదు దీనిని కొనేందుకు ఎగబడ్డారు. దీనిని రూ. 10 వేల ధర పెట్టీ కొందరు సొంతం చేసుకున్నారు. ఇక ఇంటికి వెళ్లి మంచి మసాలా దట్టించి కూర వండారట . అంతే వీధి వీధంతా చేపల వాసన ఘుమ ఘుమలతో అలజడి రేపింది.

Follow Us