AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసులు, న్యాయవాదులను ఉరుకులు పరుగులు పెట్టిన మెయిల్.. అసలేం జరిగిందంటే..?

వరంగల్ జిల్లా కోర్టును ఆకతాయిలు టార్గెట్ చేశారు. బాంబు బెదిరింపు కాల్స్‌తో న్యాయవాదులు, పోలీసులను పరుగులు పెట్టిస్తున్నారు. ఫిబ్రవరి నెల 26వ తేదీన బాంబు పెట్టామని కోర్టులో సిబ్బందిని వణికించిన ఆకతాయిలు తాజాగా మరోసారి అదే బాంబు కాల్‌తో బెంబేలెత్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.

పోలీసులు, న్యాయవాదులను ఉరుకులు పరుగులు పెట్టిన మెయిల్.. అసలేం జరిగిందంటే..?
Warangal District Court
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Mar 18, 2026 | 3:05 PM

Share

వరంగల్ జిల్లా కోర్టును ఆకతాయిలు టార్గెట్ చేశారు. బాంబు బెదిరింపు కాల్స్‌తో న్యాయవాదులు, పోలీసులను పరుగులు పెట్టిస్తున్నారు. ఫిబ్రవరి నెల 26వ తేదీన బాంబు పెట్టామని కోర్టులో సిబ్బందిని వణికించిన ఆకతాయిలు తాజాగా మరోసారి అదే బాంబు కాల్‌తో బెంబేలెత్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.

కోర్టులకు బాంబ్‌ బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా మరోసారి హనుమకొండ అదాలత్‌లోని వరంగల్ జిల్లా కోర్టులో టెన్షన్ వాతావారణం నెలకొంది.. జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని ఆగంతకుడు బాంబ్ పెట్టామని మెయిల్ ద్వారా సందేశం పంపాడు. దీంతో అప్రమత్తమైన కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్, ఫైర్ సిబ్బందితో కలిసి కోర్టుకు చేరుకున్నారు. కోర్టు పరిసర ప్రాంతాలను బాంబు స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

బాంబ్ బెదిరింపు మెయిల్ తో జిల్లా కోర్టు ఆవరణలో కొంతసేపు టెన్షన్ వాతావారణం నెలకొంది. దాదాపు గంటకు పైగా ఉద్రిక్తత నెలకొంది. కోర్టు పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్ ఫేక్ కాల్ అని తేల్చారు. ఎలాంటి బాంబ్ లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కోర్టులో బాంబు పెట్టామని మెయిల్ సందేశం పంపిన ఆగంతకుడి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఆట పట్టిస్తున్నారా..? లేక ఎవరైనా అగంతకులు కోర్టులను టార్గెట్ చేశారా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఆ అజ్ఞాత వ్యక్తుల కోసం విచారణ జరుపుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన విత్యా రామ్‌రాజ్
ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన విత్యా రామ్‌రాజ్
ఈ ఒక్క యాప్ ఉంటే చాలు.. ఒకే క్లిక్‌తో పీఎఫ్ సేవలు..
ఈ ఒక్క యాప్ ఉంటే చాలు.. ఒకే క్లిక్‌తో పీఎఫ్ సేవలు..
కళ్లముందే పేకమేడలా కూలిపోయిన కొండ.. నేపాల్‌లో జల ప్రళయం..
కళ్లముందే పేకమేడలా కూలిపోయిన కొండ.. నేపాల్‌లో జల ప్రళయం..
40 కిలోల బరువు తగ్గిన నటి ఖుష్బూ.. వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే
40 కిలోల బరువు తగ్గిన నటి ఖుష్బూ.. వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే
ఓవర్‌థింకింగ్‌ లో బంధీ అయ్యారా? బుద్ధుడు చెప్పిన ఈ కథ మీ కోసమే
ఓవర్‌థింకింగ్‌ లో బంధీ అయ్యారా? బుద్ధుడు చెప్పిన ఈ కథ మీ కోసమే
పింఛన్లపై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్.. శుభవార్త వచ్చేసింది..
పింఛన్లపై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్.. శుభవార్త వచ్చేసింది..
రణబాలి డాక్యుమెంటరీ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది..
రణబాలి డాక్యుమెంటరీ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది..
అరెరే హోటల్‌ రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాస్‌ను గుర్తించడం ఇంత సింపులా
అరెరే హోటల్‌ రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాస్‌ను గుర్తించడం ఇంత సింపులా
IIT-JEEలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్.. ఇప్పుడు దోమ మెదడుపై పరిశోధన
IIT-JEEలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్.. ఇప్పుడు దోమ మెదడుపై పరిశోధన
ట్రైన్‌లో బైక్ పార్శిల్ చేయాలా? ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.
ట్రైన్‌లో బైక్ పార్శిల్ చేయాలా? ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.