AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: కేవలం రూ.50 వేల పెట్టుబడి.. నెలకు రూ.7.50 లక్షల లాభం.. వినూత్న వ్యాపారంతో ఏపీ కుర్రాడు!

Business Idea: సుధీర్ వ్యాపారంలో ప్రధాన ఆకర్షణ ఆయన అనుసరించిన సంప్రదాయ పద్ధతి. వరి బియ్యం వాడకుండా, రాగులు, జొన్నలు, సజ్జలు వంటి 8 రకాల సిరిధాన్యాల మిశ్రమంతో ఇడ్లీలను తయారు చేయడం ప్రారంభించారు. ఈ ఇడ్లీలను ప్లాస్టిక్ లేదా స్టీల్..

Business Idea: కేవలం రూ.50 వేల పెట్టుబడి.. నెలకు రూ.7.50 లక్షల లాభం.. వినూత్న వ్యాపారంతో ఏపీ కుర్రాడు!
Millet Empire
Subhash Goud
|

Updated on: Mar 18, 2026 | 3:03 PM

Share

Business Idea: ప్రస్తుత కాలంలో పెద్ద పెద్ద చదువులు చదివిన వారు ఖాళీగా ఉంటున్నవారు ఎందరో ఉన్నారు. చాలా మందికి ఉద్యోగాలు లభించక చిన్నపాటి వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్నారు. అయితే కొందరు చిన్నపాటి పెట్టుబడితో ప్రారంభించిన వ్యాపారాలతో ఎంతో ఎదిగిపోతున్నారు. ప్రస్తుత కాలంలో సాధారణంగా ఎం.ఏ చదివిన వారు తెల్ల చొక్కా వేసుకుని ఏ ఆఫీసులోనో స్థిరపడాలని కోరుకుంటారు. కానీ వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందిన చిట్టెం సుధీర్ ఆలోచన మాత్రం భిన్నంగా ఉంది.

2018లో వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో ఎం.ఎ. పట్టా పొందిన చిట్టెం సుధీర్, ఆరోగ్యకరమైన జీవనం పట్ల మక్కువతో వైజాగ్‌లోని ఒక చిన్న ఆహార సంస్థలో కేవలం రూ.50,000 పెట్టుబడి పెట్టాడు. ఆధునిక ఆహారపు అలవాట్ల వల్ల మరుగున పడిపోతున్న చిరుధాన్యాలకు (Millets) పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు సుధీర్‌. ‘వసేనా పోలి’ అనే వినూత్న స్టార్టప్‌కు శ్రీకారం చుట్టారు. ఆరోగ్యకరమైన సమాజం వైపు ఆయన వేసిన ఆ అడుగు, నేడు నెలవారీ రూ.7.5 లక్షల టర్నోవర్‌కు దారితీసింది.

ఇది కూడా చదవండి: Biogas Plant: ఇంట్లోనే వంట గ్యాస్‌ తయారీ.. బయో గ్యాస్‌ తయారీ గురించి మీకు తెలుసా..?

సుధీర్ వ్యాపారంలో ప్రధాన ఆకర్షణ ఆయన అనుసరించిన సంప్రదాయ పద్ధతి. వరి బియ్యం వాడకుండా, రాగులు, జొన్నలు, సజ్జలు వంటి 8 రకాల సిరిధాన్యాల మిశ్రమంతో ఇడ్లీలను తయారు చేయడం ప్రారంభించారు. ఈ ఇడ్లీలను ప్లాస్టిక్ లేదా స్టీల్ ప్లేట్లలో కాకుండా, పర్యావరణానికి మేలు చేసే విస్తరాకులలో ఉడికించడం. దీనివల్ల ఇడ్లీలకు ఒక ప్రత్యేకమైన సువాసనతో పాటు ఔషధ గుణాలు కూడా తోడయ్యాయి. దీంతో ఆయన వ్యాపారం మరింత ముందుకు సాగింది. జనాలను మరింతగా ఆకట్టుకున్నాడు.

ఇది కూడా చదవండి: Bank Account: మీ ఖాతాలను మూసేస్తున్నాం.. కస్టమర్లను హెచ్చరించిన ఆ బ్యాంకు.. ఎందుకో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న సుమారు 100 మందికి పైగా గిరిజన రైతులతో ఆయన నేరుగా భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. మార్కెట్ ధరల కంటే ఎక్కువ చెల్లించి నెలకు 700 కిలోలకు పైగా మిల్లెట్లను సేకరిస్తూ, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. రసాయనాలు లేని శుద్ధమైన ధాన్యాన్ని సేకరించడమే ఆయన నాణ్యత వెనుక ఉన్న రహస్యం.

అలాగే అల్లం, క్యారెట్, సొరకాయ వంటి తాజా కూరగాయలతో తయారు చేసిన ప్రత్యేకమైన చట్నీలను అందిస్తున్నారు. ఆయన చేసిన ఆహారం సాధారణ ప్రజలనే కాకుండా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడును కూడా ఆకర్షించింది. ఆయన స్వయంగా సుధీర్‌ను పిలిపించి అభినందించడమే కాకుండా, మన దేశీ ఆహారపు గొప్పతనాన్ని చాటిచెప్పినందుకు అభినందించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆన్‌లైన్‌లో చికెన్ కొంటున్నారా..? మంచి మాంసాన్ని ఇలా ఈజీగా..
ఆన్‌లైన్‌లో చికెన్ కొంటున్నారా..? మంచి మాంసాన్ని ఇలా ఈజీగా..
మిండియాకు పట్టిన దరిద్రం అదే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్..!
మిండియాకు పట్టిన దరిద్రం అదే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్..!
నేరుగా వెళ్లి బ్యాగ్ పక్కన నిల్చుకున్న డాగ్.. ఓపెన్ చేసి చూగడా
నేరుగా వెళ్లి బ్యాగ్ పక్కన నిల్చుకున్న డాగ్.. ఓపెన్ చేసి చూగడా
కేవలం రూ.50 వేల పెట్టుబడి.. నెలకు రూ.7.50 లక్షల లాభం..
కేవలం రూ.50 వేల పెట్టుబడి.. నెలకు రూ.7.50 లక్షల లాభం..
వరంగల్ జిల్లాను టార్గెట్ చేసి వణికిస్తున్న ఆకతాయిలు..!
వరంగల్ జిల్లాను టార్గెట్ చేసి వణికిస్తున్న ఆకతాయిలు..!
పక్కకెళ్లి సిగరెట్ తాగుతుంటే పొగ చూసి ఎన్టీఆర్ ఏమన్నారంటే..?
పక్కకెళ్లి సిగరెట్ తాగుతుంటే పొగ చూసి ఎన్టీఆర్ ఏమన్నారంటే..?
ఎన్డీఏతో పొత్తుపై విజయ్ స్టాండ్ ఇదే..
ఎన్డీఏతో పొత్తుపై విజయ్ స్టాండ్ ఇదే..
ఓ వైపు తల్లి హత్య.. మరోవైపు జైల్లో నాన్న.. కన్నీళ్ల మధ్యే ..
ఓ వైపు తల్లి హత్య.. మరోవైపు జైల్లో నాన్న.. కన్నీళ్ల మధ్యే ..
బీసీసీఐ బ్లండర్ మిస్టేక్.. కట్ చేస్తే.. రిషబ్ పంత్ కెరీర్‌ క్లోజ్
బీసీసీఐ బ్లండర్ మిస్టేక్.. కట్ చేస్తే.. రిషబ్ పంత్ కెరీర్‌ క్లోజ్
ఇంట్లోనే వంట గ్యాస్‌ తయారీ..బయో గ్యాస్‌ తయారీ గురించి మీకు తెలుసా
ఇంట్లోనే వంట గ్యాస్‌ తయారీ..బయో గ్యాస్‌ తయారీ గురించి మీకు తెలుసా