AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ.. ఇంత ఈజీనా.. ఫ్రెష్ మటన్ గుర్తించడం ఇక చిటికెలో పని.. జస్ట్ ఇవి తెలిస్తే చాలు..

సండే వచ్చిందంటే చాలు.. ప్లేట్‌లో మటన్ ముక్కలు ఉండాల్సిందే.. అయితే దుకాణంలో కనిపించే రంగును, ధరను మాత్రమే చూసి గుడ్డిగా మటన్ కొనేస్తున్నారా? పైకి ఫ్రెష్‌గా కనిపించే మాంసం వెనుక రోజుల తరబడి ఫ్రిజ్‌లలో దాచిన పాత స్టాక్ ఉండే ప్రమాదం ఉంది. నాసిరకం మాంసం కొని ఆరోగ్యాన్ని పాడుచేసుకోకుండా.. ఫ్రెష్ మటన్‌ను సులభంగా గుర్తించే చిట్కాలు తెలుసుకుందాం..

వార్నీ.. ఇంత ఈజీనా.. ఫ్రెష్ మటన్ గుర్తించడం ఇక చిటికెలో పని.. జస్ట్ ఇవి తెలిస్తే చాలు..
How To Identify Fresh Mutton
Krishna S
|

Updated on: Aug 16, 2026 | 7:10 AM

Share

ఆదివారం వస్తే చాలు నాన్‌వెజ్ ప్రియుల ఇళ్లలో మటన్ ఘుమఘుమలు తప్పనిసరిగా ఉండాల్సిందే. అందుకోసం ఉదయాన్నే మార్కెట్లకు వెళ్లి మాంసం దుకాణాల ముందు బారులు తీరుతుంటారు. అయితే చాలామంది కిలో ధర ఎంత ఉందనే విషయాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని గుడ్డిగా మటన్ కొనుగోలు చేస్తుంటారు. పైకి మంచి రంగుతో, ఫ్రెష్‌గా కనిపించే మాంసం కూడా కొన్నిసార్లు రోజుల తరబడి ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన పాతది లేదా నాసిరకం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సరైన అవగాహన లేకపోవడం వల్ల నిల్వ మాంసాన్ని కొని డబ్బు వృథా చేసుకోవడమే కాకుండా అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. అందుకే నాణ్యమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన తాజా మటన్‌ను ఎలా గుర్తించాలో ఆహార నిపుణులు సూచిస్తున్న కొన్ని కీలకమైన లక్షణాలు, సులువైన చిట్కాల గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి.

నాణ్యమైన మటన్ ఎంపికకు 5 సులువైన పద్ధతులు

రంగును బట్టి నాణ్యత: తాజా మటన్ ఎప్పుడూ లేత గులాబీ నుంచి ముదురు ఎరుపు రంగులో మాత్రమే ఉంటుంది. మాంసం మొత్తం ఒకే విధమైన రంగును కలిగి ఉండాలి. బూడిద, ముదురు గోధుమ లేదా అక్కడక్కడా ఆకుపచ్చ ఛాయలో కనిపిస్తే అది నిల్వ ఉంచినట్లు గుర్తించి కొనుగోలు చేయకపోవడమే మంచిది.

వాసన పరీక్ష: తాజా మాంసం నుంచి సహజసిద్ధమైన మాంసం వాసన వస్తుంది. అలా కాకుండా పులిసిన వాసన, వికారమైన లేదా ఘాటైన దుర్వాసన వస్తుంటే ఆ మటన్ పాడైపోయిందని గుర్తించాలి.

టెక్స్చర్ : మటన్ ముక్కలను తాకినప్పుడు అవి మరీ జిగటగా లేదా జారేలా ఉండకూడదు. కొద్దిగా సహజ తేమతో కూడిన దృఢత్వాన్ని కలిగి ఉండాలి. వేలితో కాస్త నొక్కినప్పుడు మాంసం తిరిగి తన పూర్వ స్థితికి వచ్చే స్థితిస్థాపకత ఉండాలి. మరీ మెత్తగా ముద్దలా ఉంటే అది నాసిరకమని అర్థం.

అధిక నీటి లభ్యత: మటన్ ముక్కల నుంచి నిరంతరం నీరు కారుతున్నా లేదా ముక్కల చుట్టూ అధికంగా నీరు నిల్వ ఉన్నా అనుమానించాల్సిందే. సహజమైన తేమ వేరు, రసాయనాలు లేదా నీటితో బరువు పెంచిన మాంసం వేరు.

ఎముకలు, కొవ్వు పరిశీలన: మటన్‌లోని కొవ్వు స్వచ్ఛమైన తెలుపు లేదా క్రీమ్ రంగులో ఉండాలి. ఎముకలు జిగటగా మారినా లేదా రంగు మారి దుర్వాసన వస్తున్నా ఆ మాంసాన్ని తీసుకోకూడదు. ముందుగానే కోసి పెట్టిన ముక్కల కంటే మన సమక్షంలోనే తాజాగా కట్ చేయించుకోవడం ఉత్తమం.

పరిశుభ్రత తప్పనిసరి: మటన్ కొనేటప్పుడు షాపు పరిసరాలు, కత్తులు, కట్టింగ్ బోర్డుల పరిశుభ్రతను గమనించాలి. ఇంటికి తెచ్చిన వెంటనే సరైన ఉష్ణోగ్రత వద్ద ఫ్రిజ్‌లో భద్రపరచడం లేదా వెంటనే వండుకోవడం మంచిది.

Follow Us