AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

House Construction: కేవలం ఒక సెంట్‌ స్థలంలో రూ. 4 లక్షల బడ్జెట్‌లోనే ఇల్లు నిర్మాణం..!

House Construction: తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉన్నవారికి, కేవలం ఒక సెంటు స్థలంలో (403 చదరపు అడుగులు) రూ. 4 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన ఇంటి నిర్మాణం చేపట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అయితే మేస్త్రీలు, బిల్డర్స్‌ అందించిన అందించిన ఈ ప్లాన్, తక్కువ స్థలంలో సమర్థవంతమైన గృహ నిర్మాణం ఎలా సాధ్యమో వివరిస్తుంది.

House Construction: కేవలం ఒక సెంట్‌ స్థలంలో రూ. 4 లక్షల బడ్జెట్‌లోనే ఇల్లు నిర్మాణం..!
Low Budget House Construction
Subhash Goud
|

Updated on: Sep 30, 2026 | 11:19 AM

Share

House Construction: తక్కువ బడ్జెట్‌లో పరిమిత స్థలంలో సొంతింటిని నిర్మించుకోవాలనే ఆలోచన ఉన్నవారికి తక్కువ ధరల్లో నిర్మించుకునే అవకాశాలు ఉన్నాయి. కేవలం ఒక సెంటు స్థలంలో (403 చదరపు అడుగులు, 45 గజాలు) రూ. 4 లక్షల అంచనా వ్యయంతో ఎలా ఇల్లు నిర్మించుకోవచ్చో మేస్త్రీలు, బిల్డర్స్‌ వివరిస్తున్నారు. అవేంటో చూద్దాం..

ఇంటి కొలతలు, విస్తీర్ణం:

ఈ ఇంటి నిర్మాణం 20 అడుగుల 3 అంగుళాల పొడవు, 19 అడుగుల 9 అంగుళాల వెడల్పుతో విస్తరించి ఉంది. మొత్తం 403 చదరపు అడుగులు లేదా 45 గజాల విస్తీర్ణంలో, ఒక సెంటు స్థలంలో దీనిని నిర్మించారు.

నిర్మాణ వ్యయాల వివరాలు:

1. బేస్‌మెంట్ నిర్మాణం: బేస్‌మెంట్ నిర్మాణానికి సుమారు రూ. 1,50,000 నుండి రూ. 1,60,000 వరకు ఖర్చవుతుంది. ఇందులో కంకర (రెండు యూనిట్లు) రూ. 12,000, ఇటుకలు (ఒక ట్రక్కు – 5,000 ఇటుకలు) రూ. 35,000, ఐరన్ రూ. 40,000 నుండి రూ. 50,000, సిమెంట్ (50 బస్తాలు) రూ. 15,000, ఇసుక (బేస్‌మెంట్ ఫిల్లింగ్‌తో సహా) రూ. 30,000 వరకు ఖర్చవుతుంది. కార్మికులకు రూ. 40,000 నుండి రూ. 50,000 వరకు కూలీ చెల్లించాల్సి ఉంటుంది.

2. పిల్లర్స్ ఏర్పాటు: బేస్‌మెంట్ తరువాత పిల్లర్స్ వేయడానికి రూ. 40,000 నుండి రూ. 45,000 వరకు ఖర్చవుతుంది. 40 MM కంకర ఉపయోగించి పిల్లర్స్ ను ఏర్పాటు చేస్తారు. మొత్తం తొమ్మిది పిల్లర్లతో ఈ నిర్మాణం జరుగుతుంది.

3. బ్రిక్ వర్క్ (గోడల నిర్మాణం): లైట్ వెయిట్ ఇటుకలతో బ్రిక్ వర్క్ చేయడానికి రూ. 80,000 ఖర్చవుతుంది. ఒకవేళ రెడ్ బ్రిక్స్‌ను ఉపయోగిస్తే, సుమారు రూ. 1,20,000 వరకు ఖర్చు అవుతుంది, ఇది లైట్ వెయిట్ ఇటుకలతో పోలిస్తే రూ. 30,000 నుండి రూ. 40,000 అదనపు వ్యయం.

4. స్లాబ్ నిర్మాణం: స్లాబ్ వేయడానికి రూ. 1,20,000 నుండి రూ. 1,30,000 వరకు ఖర్చవుతుంది.

మొత్తం అంచనా వ్యయం:

బేస్‌మెంట్ (రూ. 1,60,000) + బ్రిక్ వర్క్ (రూ. 80,000) + పిల్లర్స్ (రూ. 40,000) + స్లాబ్ (రూ. 1,20,000) = సుమారు రూ. 4,00,000. ఇతర చిన్న చిన్న ఖర్చులతో కలిపి మొత్తం రూ. 4,00,000 నుండి రూ. 4,50,000 వరకు కావచ్చని అంచనా. అయితే మీ ప్రాంతం, అక్కడి ఖర్చులు, లేబర్‌ ఖర్చుల కూడా మారవచ్చు. ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో ఒకే ధర ఉండకపోవచ్చు. అందుకే ప్రాంతాలను బట్టి మొత్తం ఖర్చులతో తేడా ఉండవచ్చని గుర్తించుకోండి. ప్రస్తుతం అన్ని రేట్లు పెరిగిన నేపథ్యంలో ఖర్చులు పెరుగుతాయి తప్ప తగ్గే అవకాశాలు లేవని గుర్తించుకోండి.

ఇంటి ప్లాన్ వివరాలు:

ఈ ఇంటి ప్లాన్‌లో సింగిల్ బెడ్ రూమ్, హాల్, కిచెన్ ఉంటాయి.

  • బెడ్ రూమ్: 11 అడుగుల పొడవు, 10 అడుగుల 6 అంగుళాల వెడల్పు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది.
  • అటాచ్డ్ బాత్రూమ్: 4 అడుగుల వెడల్పు.
  • కిచెన్ రూమ్: 6.6 అంగుళాల విస్తీర్ణంలో ఉంటుంది. స్థలాన్ని బట్టి కిచెన్ ప్లాట్‌ఫామ్‌ను డోర్‌కు దగ్గరగా నిర్మించుకోవచ్చు. హాల్: మిగిలిన స్థలాన్ని హాల్‌గా ఉపయోగించుకోవచ్చు.ఈ ఇంట్లో మొత్తం నాలుగు తలుపులు (బాత్రూమ్ డోర్‌తో కలిపి),  నాలుగు కిటికీలు ఉంటాయి. హాల్, బెడ్ రూమ్‌లలో కబోర్డ్‌లను ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. తక్కువ బడ్జెట్‌లో, పరిమిత స్థలంలో సమర్థవంతమైన గృహ నిర్మాణానికి ఈ ప్లాన్ ఒక మంచి ఉదాహరణ. వంటి నిపుణుల సలహాతో ఇలాంటి నిర్మాణాలను చేపట్టవచ్చు.
Follow Us