AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లోకి దూసుకొస్తున్న ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్! ఫీచర్లు ఇవే

Ampere Magnus G-Max Electric Scooter.. ఎలక్ట్రిక్ స్కూటర్లకు రోజురోజుకూ డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ప్రముఖ సంస్థ తన పాపులర్ మోడల్‌ను మరింత అధునాతన హంగులతో అప్‌డేట్ చేసింది. రైడింగ్‌ను మరింత సులభతరం చేసే టెక్నాలజీ, సరికొత్త కనెక్టెడ్ ఫీచర్లు, పెద్ద డిస్‌ప్లేతో ఈ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. టెక్ ప్రియులను, రోజువారీ ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ లేటెస్ట్ స్కూటర్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లోకి దూసుకొస్తున్న ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్! ఫీచర్లు ఇవే
Ampere Magnus G Max Electric Scooter
Nikhil
|

Updated on: Aug 16, 2026 | 6:50 AM

Share

ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలపరుచుకునేందుకు ఆంపియర్ సంస్థ మాగ్నస్ జి మ్యాక్స్‌ను అప్‌డేటెడ్ ఫీచర్లతో విడుదల చేసింది. రూ.1.10 లక్షల ధరతో వస్తున్న ఈ స్కూటర్‌లో కొత్త సాఫ్ట్‌వేర్, క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన సదుపాయాలను అందించారు.

అత్యాధునిక కనెక్టెడ్ ఫీచర్లు

ఆంపియర్ కొత్తగా పరిచయం చేసిన NxG.io సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ స్కూటర్‌లో పలు కీలక మార్పులు చేశారు. ఈ అప్‌డేట్‌తో వాహనానికి 30కి పైగా కనెక్టెడ్, ఐఓటీ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. స్కూటర్‌లో అమర్చిన కొత్త 5 అంగుళాల డిస్‌ప్లే ద్వారా టర్న్ బై టర్న్ నావిగేషన్ సదుపాయం లభిస్తుంది. దీనివల్ల రోజువారీ ప్రయాణాల్లో కొత్త మార్గాలను సులభంగా గుర్తించవచ్చు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఫీచర్లలో క్రూయిజ్ కంట్రోల్ ఒకటి. ఇది ఎక్కువ దూరం ప్రయాణించే సమయంలో నిరంతరం యాక్సిలరేటర్‌ను వాడాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. అలాగే వాలుగా ఉన్న రోడ్లపై వెనక్కి వెళ్లకుండా ఆపే హిల్ హోల్డ్ అసిస్ట్‌ను కూడా జోడించారు.

పార్కింగ్ చేసిన తర్వాత వాహనం ఎక్కడ ఉందో గుర్తుతెచ్చుకునేందుకు ఫోన్ యాప్ ద్వారా పింగ్ చేసి సులభంగా కనుగొనవచ్చు. రియల్ టైమ్ ఛార్జింగ్ స్టేటస్, లైవ్ ట్రాకింగ్, జియోఫెన్సింగ్, యాంటీ-థెఫ్ట్, టోయింగ్ అలర్ట్‌లు వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. ఓటీఏ అప్‌డేట్స్ సదుపాయం ఉండటం వల్ల సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండానే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను పొందవచ్చు. ఈ కనెక్టెడ్ ఫీచర్లన్నీ ఆంపియర్ కనెక్ట్ యాప్ ద్వారా సులభంగా ఉపయోగించుకోవచ్చు.

ఆకర్షణీయమైన రంగులు

మెకానికల్ పరంగా ఇందులో పెద్దగా మార్పులు చేయనప్పటికీ, శక్తివంతమైన 3kWh LFP బ్యాటరీని అమర్చారు. దీనికి 2.4kW పీక్ పవర్ అందించే హబ్ మౌంటెడ్ మోటార్‌ను జతచేశారు. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌పై 142 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్‌ను అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 65 కిలోమీటర్లు. బ్యాటరీకి 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తుండగా, బ్యాటరీ జీవితకాలం ఏకంగా 2 లక్షల కిలోమీటర్ల వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది.

ఈ స్కూటర్‌ను మరింత స్టైలిష్‌గా మార్చేందుకు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందిస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న మాన్‌సూన్ బ్లూ, మచ్చా గ్రీన్ రంగులతో పాటు తాజాగా సిన్నమోన్ కాపర్ కలర్‌ను కూడా అదనంగా చేర్చారు. అన్ని హంగులతో రూ.1.10 లక్షల ధర వద్ద లభిస్తున్న ఈ మోడల్ ఎలక్ట్రిక్ మార్కెట్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది.

Follow Us