AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రీన్ టీ vs బ్లాక్ టీ.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

Green Tea vs Black Tea: రోజూ తాగే నార్మల్ పాల టీకి బైబై చెప్పేసి.. గ్రీన్ టీ, బ్లాక్ టీల వైపు షిఫ్ట్ అయిపోతున్నారా? అయితే ఆగండి.బెల్లీ ఫ్యాట్ కరిగించి, బ్లడ్ షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచే రియల్ ఛాంపియన్ ఏది? మీ ఫిట్‌నెస్ గోల్స్‌కి గ్రీన్ టీ బెస్టా లేక బ్లాక్ టీ తోపా? అసలు సైన్స్ ఏం చెబుతుందో క్లియర్‌గా తెలుసుకుందాం..

గ్రీన్ టీ vs బ్లాక్ టీ.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
Green Tea Vs Black Tea
Krishna S
|

Updated on: Aug 16, 2026 | 6:40 AM

Share

ఉదయం లేవగానే వేడివేడిగా ఒక కప్పు టీ తాగడం చాలామందికి అలవాటే. అయితే ఆరోగ్యపై శ్రద్ధ పెరిగిన నేటి కాలంలో పాలతో చేసిన సాధారణ టీ కంటే గ్రీన్ టీ, బ్లాక్ టీలను ఎంచుకునే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ రెండు టీలలోనూ బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, రెండింటి మధ్య ఉన్న తేడాలేంటి? అనే డౌట్లు చాలా మందికి వస్తాయి. నిజానికి గ్రీన్ టీ, బ్లాక్ టీ రెండింటిలోనూ పాలీఫెనాల్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, వివిధ దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.

గ్రీన్ టీ ప్రత్యేకతలు

గ్రీన్ టీలో కేటెచిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపులను తగ్గించడంలో, జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో గ్రీన్ టీ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచి, రక్తంలో చక్కెర నిల్వలను సమతుల్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. జీవక్రియను మెరుగుపరచడం ద్వారా శరీరంలో అనవసర కొవ్వు కరిగించడానికి, బరువును అదుపులో ఉంచడానికి గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుంది.

బ్లాక్ టీ ప్రత్యేకతలు – ప్రయోజనాలు

టీ ఆకులు పూర్తిగా ఆక్సీకరణం చెందినప్పుడు ఈ రకమైన ప్రత్యేక యాంటీఆక్సిడెంట్లు ఏర్పడతాయి. బ్లాక్ టీలోని పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తనాళాల పనితీరును కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది కూడా సహాయపడినప్పటికీ, గ్రీన్ టీతో పోలిస్తే దీని ప్రభావం కాస్త తక్కువగా ఉంటుంది.

టీ తయారుచేసే సరైన పద్ధతి – నిపుణుల సలహాలు

గ్రీన్ టీ: నీటిని అతిగా మరిగించకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు టీ ఆకులు లేదా బ్యాగ్‌ను వేసి 2-3 నిమిషాలు మాత్రమే ఉంచాలి. ఎక్కువగా మరిగిస్తే అందులోని పోషకాలు నశిస్తాయి.

బ్లాక్ టీ: వేడి నీటిలో కొద్ది సమయం పాటు నాననివ్వడం ద్వారా మంచి రుచి, సమ్మేళనాలు విడుదలవుతాయి.

పంచదార అస్సలు వద్దు: గ్రీన్ టీ లేదా బ్లాక్ టీలలో పంచదార కలపడం వల్ల వాటిలోని సహజ పోషక విలువలు, బరువు తగ్గే గుణాలు దెబ్బతింటాయి. వీటిని ఎలాంటి చక్కెర లేకుండా తాగడమే ఆరోగ్యకరం.

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌