AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంట్రీ లెవెల్‌ స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకునే వారిని టార్గెట్‌ చేస్తున్న రియల్​మీ..! ఫీచర్లు సూపర్

Realme P4s Lite.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ నుంచి మరో కొత్త బడ్జెట్ హ్యాండ్​సెట్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ముమ్మరంగా సిద్ధమవుతోంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే కస్టమర్లను టార్గెట్ చేస్తూ ఈ ఫోన్‌ను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో దర్శనమిచ్చిన ఈ లేటెస్ట్ డివైజ్ మార్కెట్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఎంట్రీ లెవెల్‌ స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకునే వారిని టార్గెట్‌ చేస్తున్న రియల్​మీ..! ఫీచర్లు సూపర్
Realme P4s Lite
Nikhil
|

Updated on: Aug 16, 2026 | 7:00 AM

Share

రియల్‌మీ P4 సిరీస్‌లో భాగంగా బడ్జెట్ ధరలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ భారత్‌లో విడుదల కానుంది. BIS సర్టిఫికేషన్ పొందిన ఈ ఫోన్ తక్కువ ధరలో భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లేను అందించే అవకాశం ఉంది. ఎంట్రీ-లెవల్ మార్కెట్‌లో ఇది వినియోగదారులకు చక్కటి ఆప్షన్‌గా నిలవనుంది.

శక్తివంతమైన ఫీచర్లు

రియల్‌మీ నుంచి రాబోతున్న ఈ కొత్త ఫోన్ BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో RMX5398 మోడల్ నంబర్‌తో కనిపిచింది. లీకైన నివేదికల ప్రకారం ఇందులో 6.74 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించే అవకాశం ఉంది. పెద్ద స్క్రీన్ ఉండటం వల్ల వీడియోలు చూడటానికి, వెబ్ బ్రౌజింగ్ చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇక పనితీరు విషయానికి వస్తే, ఇందులో యూనిసోక్ ప్రాసెసర్‌ను ఉపయోగించే ఛాన్స్ ఉంది. దీనికి తోడు దుమ్ము, నీటి తుంపరల నుంచి రక్షణ కల్పించే ఐపీ54 రేటింగ్ కూడా లభించవచ్చని సమాచారం.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలిచే అంశం బ్యాటరీ సామర్థ్యం. ఇందులో ఏకంగా 7000mAh లేదా 6300mAh భారీ బ్యాటరీని అమర్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి ఇది సరిగ్గా సరిపోతుంది. అలాగే ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఇవ్వొచ్చు.

అంచనా ధర

సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్ ఆధారిత రియల్‌మీ యూఐ ఇంటర్‌ఫేస్‌పై పనిచేసే అవకాశం ఉంది. కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్‌ను అందించడం ద్వారా యూజర్లకు మెరుగైన సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని పంచాలని కంపెనీ భావిస్తోంది. ఇక ధర విషయానికి వస్తే, దీనిని సుమారు రూ.7,000 ధరల పరిధిలో తీసుకువచ్చే అవకాశం ఉందని మార్కెట్లో గట్టి ప్రచారం జరుగుతోంది.

రియల్‌మీ ఇప్పటికే ఇదే సిరీస్‌లో కొన్ని మోడళ్లను అందుబాటులో ఉంచగా, ఈ కొత్త ఫోన్‌ను మరింత ఆకర్షణీయమైన ధరలో లాంచ్ చేస్తే మార్కెట్లో మంచి స్పందన లభించడం ఖాయం. అయితే ఫోన్ పేరు, లాంచ్ తేదీ, అధికారిక ధర వంటి పూర్తి వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రియల్‌మీ నుంచి వచ్చే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us
కాలనీ గాసిప్ ను అమ్మకానికి పెట్టి.. రెండు ఇళ్లు కొన్న మహిళ!
కాలనీ గాసిప్ ను అమ్మకానికి పెట్టి.. రెండు ఇళ్లు కొన్న మహిళ!
పోలీస్ స్టేషన్‌లో యువకుడు నిప్పంటించుకుని పరుగులు!
పోలీస్ స్టేషన్‌లో యువకుడు నిప్పంటించుకుని పరుగులు!
ప్రాచీన కాలంనాటి ఈ జావ తాగితే ఫుల్ ఎనర్జీ, నరాల బలహీనత కూడా పరార్
ప్రాచీన కాలంనాటి ఈ జావ తాగితే ఫుల్ ఎనర్జీ, నరాల బలహీనత కూడా పరార్
ఆ నటుడు నా గురువు.. నాకు యాక్టింగ్ నేర్పించారు..
ఆ నటుడు నా గురువు.. నాకు యాక్టింగ్ నేర్పించారు..
LPG Gas వినియోగదారులకు బిగ్ రిలీఫ్..మారిన సిలిండర్ బుకింగ్ రూల్స్
LPG Gas వినియోగదారులకు బిగ్ రిలీఫ్..మారిన సిలిండర్ బుకింగ్ రూల్స్
పురుషుల షర్టులకు కుడివైపు, మహిళల షర్టులకు ఎడమవైపున బటన్లు ఎందుకు
పురుషుల షర్టులకు కుడివైపు, మహిళల షర్టులకు ఎడమవైపున బటన్లు ఎందుకు
జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడని 3 గొప్ప పాఠాలు.. వేటగాడు-డేగ కథ
జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడని 3 గొప్ప పాఠాలు.. వేటగాడు-డేగ కథ
కొండపై తచ్చాడుతుంది.. ఏంటా అని కెమెరా జూమ్ చేసి చూడగా..
కొండపై తచ్చాడుతుంది.. ఏంటా అని కెమెరా జూమ్ చేసి చూడగా..
బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి పవర్‌ఫుల్ అటుకులు..
బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి పవర్‌ఫుల్ అటుకులు..
బిగ్‏బాస్ 10లోకి మీనా, బాలు.. ఫ్యాన్స్ షాక్..
బిగ్‏బాస్ 10లోకి మీనా, బాలు.. ఫ్యాన్స్ షాక్..