AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. జాగ్రత్త ఆ డేంజర్ వ్యాధికి సంకేతం కావచ్చు!

ఈ రోజుల్లో జుట్టు రాలడం ప్రతి ఒక్కరిలో సర్వసాధారణం అయిపోయింది. కానీ దీన్ని లైట్‌ తీసుకుంటే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవచ్చు. ఎందుకంటే ఇది అనేక వ్యాధులకు కూడా ఒక సంకేతం కావచ్చు. అవును డాక్టర్ సౌమ్య సచ్‌దేవా జుట్టు రాలడం పెరిగినప్పుడు ఏమి చేయాలి? ఈ సమస్య లక్షణం ఏమిటి, దానిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. జాగ్రత్త ఆ డేంజర్ వ్యాధికి సంకేతం కావచ్చు!
Hair Loss Women
Anand T
|

Updated on: Mar 18, 2026 | 3:32 PM

Share

ఈ రోజుల్లో చాలా మంది మహిళలు జుట్టు రాలడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. పాత వెంట్రుకల స్థానంలో కొత్తవి పెరుగుతుంటాయి కాబట్టి, ప్రతిరోజూ సుమారు 50 నుండి 100 వెంట్రుకలు రాలడం సాధారణమేనని నిపుణులు చెబుతున్నారు. కానీ మీ హెయిర్ ఫాల్ అనేది సాధారణం కన్నా ఎక్కువగా ఉంటే మీరు వెంటనే అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కొన్నిసార్లు శరీరంలోని అంతర్గత ఆరోగ్య సమస్యలకు సూచన కావచ్చు. కాబట్టి మీరూ ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి

జుట్టు అతిగా రాలడం దేనికి సూచన?

చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ సౌమ్య సచ్‌దేవా ప్రకారం, మహిళల్లో అధికంగా జుట్టు రాలడానికి అనేక ఆరోగ్య సమస్యలు కారణం కావచ్చు. థైరాయిడ్ సమస్య ఉంటే, శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది జుట్టు కుదుళ్లను బలహీనపరిచి, జుట్టు త్వరగా రాలిపోయే అవకాశాలను పెంచుతుంది. అంతేకాకుండా, శరీరంలో ఐరన్ లోపం లేదా రక్తహీనత ఉంటే, జుట్టుకు అవసరమైన పోషకాలు అందవు. ఫలితంగా, జుట్టు బలహీనంగా రాలిపోతుంది. హార్మోన్ల అసమతుల్యత, ముఖ్యంగా PCOS ఉన్న మహిళల్లో, కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి దారితీయవచ్చు.

దీని వల్ల ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉంది?

హార్మోన్ల అసమతుల్యత, ఐరన్ లేదా ప్రోటీన్ లోపాలు ఉన్నవారు, అధిక ఒత్తిడికి గురయ్యేవారికి జుట్టు రాలడం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా, రసాయనాలు అధికంగా ఉన్న జుట్టు ఉత్పత్తులను ఉపయోగించడం, తరచుగా హెయిర్ స్టైలింగ్ చేసుకోవడం, లేదా జుట్టును మరీ గట్టిగా కట్టడం వంటివి కూడా జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తాయి.

దీన్ని ఎలా నివారించవచ్చు?

జుట్టు రాలడాన్ని నివారించడానికి, సమతుల్యమైన, పోషకమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా ఇనుము, ప్రోటీన్, విటమిన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, తగినంత నిద్రపోవడం, మీ జుట్టును సరిగ్గా సంరక్షించుకోవడం కూడా ముఖ్యం. జుట్టు రాలడం ఎక్కువ కాలం కొనసాగితే, వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల నుంచి సేకరించిన సమాచారం ఆదారంగా అందించబడినవది. వీటిని TV9 దృవీకరించడం లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం