AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్డీఏతో పొత్తుపై విజయ్ స్టాండ్ ఇదే.. తేల్చిన చెప్పిన టీవీకే పార్టీ ముఖ్యనేత..!

తమిళనాడులో ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 23 న పోలింగ్ జరగనుంది. అధికార డీఎంకే ఎన్నికల పోరుకు అన్ని విధాల సిద్దమైంది. మిత్రపక్షాలతో కలిసి కూటమిని కూడా ఏర్పాటు చేసుకుని సీట్ల పంపకాల విషయంలో దాదాపు పూర్తి కావచ్చాయి. ఇక అన్నాడీఎంకే - బీజేపీ కలిసి కూటమిని ఏర్పాటు చేశాయి.

ఎన్డీఏతో పొత్తుపై విజయ్ స్టాండ్ ఇదే.. తేల్చిన చెప్పిన టీవీకే పార్టీ ముఖ్యనేత..!
Actor Vijay, Aadhav Arjuna
Ch Murali
| Edited By: |

Updated on: Mar 18, 2026 | 2:51 PM

Share

తమిళనాడులో ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 23 న పోలింగ్ జరగనుంది. అధికార డీఎంకే ఎన్నికల పోరుకు అన్ని విధాల సిద్దమైంది. మిత్రపక్షాలతో కలిసి కూటమిని కూడా ఏర్పాటు చేసుకుని సీట్ల పంపకాల విషయంలో దాదాపు పూర్తి కావచ్చాయి. ఇక అన్నాడీఎంకే – బీజేపీ కలిసి కూటమిని ఏర్పాటు చేశాయి. ఎన్డీఏ కూటమిలో పీఎంకే, టీటీవీ దినకరన్ స్థాపించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీలు ఉన్నాయి. డీఎంకే దాదాపు 26 పార్టీలతో మెగా కూటమి ఏర్పాటు చేసింది. ప్రస్తుత సర్వేల ప్రకారం డీఎంకే కూటమి బలంగా ఉన్నట్టు తేలడంతో ఎన్‌డీఏ బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలోనే కొత్తగా పార్టీ ఏర్పాటు చేసిన విజయ్ కోసం గాలం వేసింది. పొత్తు దాదాపు కుదిరిందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే, విజయ్ కి 60 స్థానాలు ఎవరు ఉన్నారన్న వార్తలు కూడా బయటకు వచ్చాయి. అధికార భాగస్వామి విషయంలో మాత్రమే క్లారిటీ లేదని పొత్తు దాదాపు కుదిరినట్టేనని టీవీకేలో కొందరు నేతలు కూడా చెప్పుకొచ్చారు. చెన్నైలో జరిగిన టివీకే ఎన్నికల ప్రచార సభలో ఆ పార్టీ ముఖ్యనేత ఆదవ్ అర్జున కీలక విషయాలను వెల్లడించారు. ఎన్డీయే కూటమిలోకి రావాలని విజయ్‌కు బీజేపీ నేతలు చాలా అఫర్లు ఇచ్చారు. అందులో కీలకమైంది రెండున్నరేళ్ల సీఎం పదవి ఇస్తాన్నారు. మరో రెండున్నరేళ్లు మాజీ సీఎం అన్నా డీఎంకే చీఫ్ పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఉంటారని బీజేపీ నేతలు తమకు ఇచ్చిన ఆఫర్ లో చెప్పారన్నారు. 90 సీట్లు టివికీ కి ఇస్తామన్నారు.. మరో 90 సీట్లలో అన్నా డీఎంకే పోటీ చేస్తుందని చెప్పినట్లు సభలో అర్జున చెప్పుకొచ్చారు.

అయితే వీటన్నింటినీ విజయ్ వద్దనుకున్నారు. ఎందుకు అంటే డిల్లీకి బానిసగా ఉండే సీఎం పదవి నాకు అక్కర్లేదు అని విజయ్ తేల్చి చెప్పారని, కాబట్టే పొత్తుకు వెళ్ళడం లేదని అర్డున తెలిపారు. అందుకే జన నాయకన్ సినిమాని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. డిల్లీకి నేతలకు తలొగ్గి సెన్సార్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి మాకు లేదని, తమిళ రాజకీయాల్లో పెను మార్పును తీసుకువస్తామని అర్జున ఈ వేదికపై నుంచి చెప్పారు..

రజనీకాంత్‌కు క్షమాపణలు చెప్పిన ఆదవ్ అర్జున

రజనీకాంత్ భయపడి రాజకీయాల్లోకి రాకుండా ఉండిపోయారని గతంలో ఆదవ్ అర్జున తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తమిళనాట పెద్ద దుమారం రేపాయి. రజనీకాంత్ పై అర్జున వ్యాఖ్యలపై మండిపడ్డ అభిమాన సంఘాలు విజయ్ పై విమర్శలు మొదలు పెట్టారు. రజనీకి మద్దతుగా నిలిచిన అన్నాడీఎంకే నేతలు టీవీకే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. టీవికే సభలో బహిరంగంగా రజనీకాంత్ కు క్షమాపణలు చెప్పిన ఆదవ్ అర్జున. నేను అన్న మాటలను వక్రీకరించారని అన్నారు. గతంలో దివంగత విజయ్‌కాంత్‌ను కుట్రపన్ని డీఎంకే నాశనం చేసిందని రజనీ కాంత్ రాజకీయాల్లోకి రాకుండా కుట్ర చేసింది కూడా డీఎంకే పార్టీనే అనేది నా మాటల్లో అర్ధం అయినా క్షమాపణలు చెబుతున్నా అని ఆదవ్ అర్జున స్పష్టం చేశారు. మా నాయకుడు విజయ్ కూడా ఆయన అభిమాని, విజయ్‌కి కూడా ఆయనే నాయకుడు అని అర్జున అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us