AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. 17 ఏళ్లుగా సినిమాలకు దూరం.. ఈ హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందంటే..

15 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి కథానాయికగా అడుగుపెట్టి.. ఆ తర్వాత స్టార్ డమ్ సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. తక్కువ సమయంలోనే తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఊహించని విధంగా సినిమాలకు దూరమైపోతుంటారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందామా.

Tollywood : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. 17 ఏళ్లుగా సినిమాలకు దూరం.. ఈ హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందంటే..
Sindhu Menon
Rajitha Chanti
|

Updated on: May 28, 2026 | 4:29 PM

Share

సాధారణంగా సినీరంగంలో చాలా మంది హీరోయిన్స్ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమయ్యారు. నటనతోపాటు అందంలోనూ రాణించిన తారలు చాలా తక్కువ మంది ఉన్నారు అలాంటి వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. బాలనటిగా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళం, కన్నడ భాషలలోనూ నటించి మెప్పించారు. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె మరెవరో కాదు హీరోయిన్ సింధు మీనన్. దివంగత హీరో శ్రీహరి ప్రధాన పాత్రలో నటించిన భద్రాచలం సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే సహజ నటనతోపాటు అందంతో ఆకట్టుకుంది. దీంతో తెలుగులో ఒక్కసారిగా అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత త్రినేత్రం సినిమాతో మరోసారి పాపులర్ అయ్యింది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. అంతకు ముందు ఆమె కన్నడ సినీరంగంలోకి బాలనటిగా తెరంగేట్రం చేసింది.

ఎక్కువమంది చదివినవి : Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు.

1996లో వచ్చిన ‘హులియా’ అనే కన్నడ చిత్రంలో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో ఆమె కెరీర్ మలుపు తిప్పిన సినిమా చందమామ. ఈ మూవీలో అల్లరి పిల్లగా అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఈ మూవీ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుందని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. ఆమె ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకుని లండన్‌లో స్థిరపడింది. ఆమె కథానాయికగా నటించిన చివరి చిత్రం ఈరం. తెలుగులో వైశాలి పేరుతో రిలీజ్ చేశారు. ఇందులో ఆది పినిశెట్టి హీరోగా నటించారు. 2009లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ మరుసటి ఏడాది ఆమె పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది..

ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి లండన్ లో నివసిస్తుంది సింధు మీనన్. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం సింధు మీనన్ ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్స్.. చందమామ హీరోయిన్ కూతురు ఎంతో చూడచక్కగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Ammoru Movie: అమ్మోరు సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నా.. కారణం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్..

సింధు మీనన్ ఇన్ స్టా పోస్ట్..

ఎక్కువమంది చదివినవి : Suman Shetty : ఆ డైరెక్టర్ చెప్పడంతో హైదరాబాద్‏లో స్థలం కొని ఇల్లు కట్టాను.. ఇప్పుడు ధర ఎంతంటే.. సుమన్ శెట్టి..

Follow Us
స్మార్ట్‌ఫోన్ కోసం కోతి వేసిన ‘స్కెచ్’ చూస్తే మైండ్‌బ్లాక్!
స్మార్ట్‌ఫోన్ కోసం కోతి వేసిన ‘స్కెచ్’ చూస్తే మైండ్‌బ్లాక్!
ధనం, విజయం, శుభఫలితాల కోసం.. ఈ ఒక్క మంత్రం చాలంట!
ధనం, విజయం, శుభఫలితాల కోసం.. ఈ ఒక్క మంత్రం చాలంట!
వాడో నీచుడు.. అలాంటోడికి నేనేందుకు ఆన్సర్ చేయాలి: దాదా
వాడో నీచుడు.. అలాంటోడికి నేనేందుకు ఆన్సర్ చేయాలి: దాదా
దేశ విదేశాల్లో ప్రయాణిస్తూ బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాల్లో
దేశ విదేశాల్లో ప్రయాణిస్తూ బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాల్లో
బడ్జెట్ తక్కువ ఫీచర్లు ఎక్కువ.. మార్కెట్‌లోకి నథింగ్‌
బడ్జెట్ తక్కువ ఫీచర్లు ఎక్కువ.. మార్కెట్‌లోకి నథింగ్‌
ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసిన సమంత
ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసిన సమంత
మారిన మ్యాచ్ టైమింగ్స్.. IND vs IRE ఫ్రీగా ఎలా చూడాలంటే?
మారిన మ్యాచ్ టైమింగ్స్.. IND vs IRE ఫ్రీగా ఎలా చూడాలంటే?
లాంగ్‌ రైడ్స్‌లో కంఫర్ట్‌ కోసం స్పెషల్ ఏప్రిల్‌ 457
లాంగ్‌ రైడ్స్‌లో కంఫర్ట్‌ కోసం స్పెషల్ ఏప్రిల్‌ 457
ఉరుములు వినిపిస్తే ‘అర్జునా-ఫాల్గుణా’ ఎందుకు అంటారు? దీని వెనుక..
ఉరుములు వినిపిస్తే ‘అర్జునా-ఫాల్గుణా’ ఎందుకు అంటారు? దీని వెనుక..
పానకాల స్వామి సాక్షిగా దీక్షలోకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
పానకాల స్వామి సాక్షిగా దీక్షలోకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్